ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ముగిసిన తర్వాత ఏపీలో జనసేన పార్టీ దూకుడు పెంచింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఎక్కడికక్కడ నిరసనలు తెలపడంతో పాటు, రాష్ట్ర నేతలు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 5న మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానున్నట్లు పార్టీ ప్రకటించింది. ఈ సమావేశంలో…
ఏపీలో జిల్లాల విభజనకు సంబంధించి శనివారం అర్ధరాత్రి కొత్త నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. 26 జిల్లాలకు కొత్త కలెక్టర్ కార్యాలయాలు సిద్ధమయ్యాయి. దీంతో కలెక్టర్ కార్యాలయాల అడ్రస్‌లతో నోటిఫికేషన్ జారీ చేశారు. మరోవైపు జిల్లా పరిషత్‌ల విభజనపై మంత్రి బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. ఇప్పట్లో జిల్లా పరిషత్‌ల విభజన లేనట్లేనని ఆయన స్పష్టం చేశారు. జిల్లా పరిషత్‌ల విభజనపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని మంత్రి బొత్స తెలిపారు. ప్రస్తుతమున్న జిల్లా పరిషత్‌ల నుంచే…
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంపై సీఎస్ సమీర్ శర్మ దాఖలు చేసిన అఫిడవిట్లో కీలక అంశాలు ప్రస్తావించారు.. రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనకు 6 నెలలు కాదు.. 60 నెలలు కావాలని పేర్కొన్నారు.. రాజధాని ప్రాంతం నుంచి వెళ్లిపోయిన వర్కర్లు, యంత్రాలను రప్పించేందుకే రెండు నెలల సమయం అవసరమన్న ఆయన.. అమరావతిలో పనులు మొదలు పెట్టేందుకే 8 నెలల సమయం పడుతుందన్నారు.. రోడ్ల నిర్మాణం కోసం 16 నెలలు అవసరం అవుతుందని.. రోడ్ల పనులు పూర్తి చేశాక, డ్రైనేజి,…
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలకు సంబంధించిన గెజిట్ ఏ క్షణంలోనైనా విడుదల కానుంది… జిల్లా పునర్విభజనకు సంబంధించిన ఫైనల్ డ్రాఫ్ట్ కు ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలపింది.. మొత్తంగా 26 జిల్లాలకు ఆమోదం తెలిపింది కేబినెట్.. 26 జిల్లాల్లో 73 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కాబోతున్నాయి.. కొత్తగా 22 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తున్నారు.. కొత్తగా మన్యం జిల్లా, అల్లూరి జిల్లా, అనకాపల్లి, కోనసీమ, రాజమండ్రి, నరసాపురం, బాపట్ల, నర్సరావుపేట, తిరుపతి, అన్నమయ్య జిల్లా, నంద్యాల, సత్యసాయి, ఎన్టీఆర్-విజయవాడ…
సింహం సింగిల్‌గానే వస్తుంది.. పందులే గుంపులుగా వస్తాయంటూ విపక్షాలపై సెటైర్లు వేశారు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్.. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం మబుగాంలో సచివాలయాన్ని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీడీపీ పొత్తు లేకుండా ఎన్నికల్లో గెలవగలదా? అని ప్రశ్నించారు.. తెలుగుదేశం పార్టీని సింగిల్‌గా పోటీచేయమని చెప్పండి.. చంద్రబాబు, లోకేష్, అచ్చెంనాయుడు.. తాము ఒంటరిగా పోటీచేస్తామని చెప్పమనండి అంటూ సవాల్ విసిరారు.. ఇక, వారు పొత్తు ఉండదని చెప్పలేరన్న ఆయన.. అంతా కలసి మాపై…
జేసీ బ్రదర్స్ అంటేనే సంచలన వ్యాఖ్యలకు మారుపేరు.. ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడేస్తుంటారు.. అయితే, కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు ఆగ్రహానికి గురైన ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష కూడా ఖరారు అయ్యింది.. క్షమాపణలు చెప్పడంతో ఆ శిక్షలను సేవగా మార్చేసింది హైకోర్టు.. ఇక, ఈ వ్యవహారంపై స్పందించిన టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు సహా అందరూ కోర్టు మెట్లు ఎక్కుతున్నారన్న…
కష్టమంటే ఆదుకోవడంలో ముందుంటారు జనసేన అధినేత, పవర్ స్టార్ పవర్ కల్యాణ్.. ప్రకృతి విపత్తుల నుంచి సమయం, సందర్భం ఏదైనా.. నేనున్నానంటూ ముందుకు వస్తారు.. ఇప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలపై ఫోకస్ పెట్టారు.. ఏపీలో రైతులు, కౌలు రైతులు పంట నష్టాలు… అప్పుల భారంతో ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్న ఆయన… అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాల్లోనే 80మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు అంటే సాగును నమ్ముకొన్నవారి పరిస్థితి ఎంత దయనీయంగా…
ఏపీలో ఈనెల 11న సీఎం జగన్ కేబినెట్ విస్తరణ చేపట్టనున్నారు. దీంతో చాలా మంది వైసీపీ నేతలు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ విస్తరణ మొత్తాన్ని సీఎం జగన్ చూస్తున్నారని సజ్జల తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేసేలా కేబినెట్ విస్తరణ ఉంటుందన్నారు. కేబినెట్లో మెజార్టీ మార్పులు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. సోషల్ జస్టిస్‌కు…
ఏపీలో పెరిగిన విద్యుత్ ఛార్జీలపై టీడీపీ వినూత్న నిరసనలకు శ్రీకారం చుట్టింది. ఉగాది పర్వదినం రోజు కూడా టీడీపీ నేతలు ఆందోళనలు చేపట్టారు. ఈ మేరకు విజయవాడలో టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా చెవిలో పూలు పెట్టుకుని వినూత్న నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా టీడీపీ నేత బుద్ధా వెంకన్న మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై…
తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరగుతున్నాయి. ఈ వేడుకలకు సీఎం జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. ముందుగా దివంగత నేత వైఎస్ఆర్ ఫోటోకు నివాళులర్పించి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ ఆస్థాన సిద్ధాంతి కప్పగంతు సుబ్బరామ సోమయాజి పంచాంగ పఠనం చేశారు. చాలా మంచి పథకాలతో ప్రజలకు దగ్గరయ్యే అవకాశం ఈ ప్రభుత్వానికి దొరుకుతుందని ఆయన చెప్పారు. శుభకృత్ నామసంవత్సరంలో పేరుకు తగ్గట్లే ప్రభుత్వానికి…