ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చల్లటి కబురు చెప్పింది వాతావరణ కేంద్రం.. ఈ రోజు, రేపు, ఎల్లుండి మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.. ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో దిగువ ట్రోపోఆవరణములో దక్షిణ మరియు నైరుతి గాలులు వీస్తున్నాయని.. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన ఇలా ఉండనుంది.. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాంలో.. ఈరోజు, రేపు…
కేబినెట్లో ఆయనకు రెండోసారి ఛాన్స్ దక్కింది. అవకాశం ఇచ్చినా ఒకే.. లేకపోయినా డబుల్ ఓకే అన్నట్టుగా వ్యవహారం నడిచింది. ఒకానొక సమయంలో తెరవెనక మంత్రాంగం నడిచినా.. ఆయన మరోలా నరుక్కొచ్చారని తాజాగా చర్చ జరుగుతోంది. ఆ విషయం తెలిసినప్పటి నుంచి అదా.. కథ అని నోరెళ్ల బెడుతున్నారట. ఇంతకీ ఎవరా మంత్రి? సీఎం జగన్‌కు సన్నిహితం ఆదిమూలపు సురేష్. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ఉన్న ఆయన.. ఏపీ కేబినెట్లో రెండోసారి కూడా చోటు దక్కించుకున్నారు. వైసీపీ…
సీఎం వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ఏపీ సీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి.. నా ఇష్టం నా రాజ్యాంగ అన్నట్లు సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మీద భారం మోపుతున్నాయన్నారు.. మూడేళ్ల పాలనలో మద్యం రేట్లు మూడు వందల శాతం పెంచారంటూ జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు.. ఇక, మంత్రివర్గ విస్తరణలో సత్య సాయి జిల్లాకు సీఎం వైఎస్ జగన్ అన్యాయం…
గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధిస్తాం…రాష్ట్రానికి.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మంచి పేరు తీసుకొస్తాను అని వెల్లడించారు డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు… సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు.. 2026 వరకూ పాత జిల్లాల్లోనే జెడ్పీలను కొనసాగించేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ఫైల్ పై మొదటి సంతకం చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని పంచాయితీల్లో తాగునీరు పారిశుద్ధ్యం మెరుగు పరుస్తామని…
రెండు రోజుల పాటు కడప, కర్నూలు జిల్లాలో బిజీ బిజీగా గడపనున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి… ఇవాళ సాయంత్రం కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న ఆయన.. 5.40 గంటలకు కడప ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి ఒంటిమిట్టలోని టీటీడీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. ఇక, రాత్రి 7.20 గంటలకు టీటీడీ గెస్ట్‌హౌస్ నుంచి బయల్దేరి.. రాత్రి 7.30 నుంచి 7.40 గంటల మధ్య కోదండరామస్వామి ఆలయానికి చేరుకుంటారు.. ఆ తర్వాత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు…
* ఐపీఎల్లో నేడు హైదరాబాద్‌తో తలపడనున్న కోల్‌కతా.. ముంబైలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ * తిరుమలలో రెండో రోజు శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు.. ఇవాళ స్వర్ణరథంపై భక్తులకు మలయప్పస్వామి దర్శనం * నేడు కడపలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి కళ్యాణం.. కోదండరామస్వామికి పట్టా వస్త్రాలు సమర్పించనున్న సీఎం వైఎస్ జగన్ * ఇవాళ తిరుమలలో తెలంగాణ గవర్నర్ తమిళిసై పర్యటన.. శ్రీవారిని దర్శించుకోన్న గవర్నర్ * నేడు విశాఖకు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్.. ఈ…
అన్ని చార్జీలు మోత మోగుతున్నాయి.. కేంద్రం, రాష్ట్రం అనే తేడా లేకుండా వరుసగా అన్ని చార్జీలు పెంచేస్తున్నాయి.. ముఖ్యంగా పెట్రో చార్జీల పెంపు ప్రభావం అన్నింటిపై పడుతోంది.. ఇప్పటికే తెలంగాణలో ఈ మధ్యే రెండు సార్లు ఆర్టీసీ చార్జీలు వడ్డించారు.. పెరిగిన డీజిల్ ధరల నేపథ్యంలో ఇది తప్పలేదని పేర్కొన్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆర్టీసీ చార్జీల వడ్డనకు రంగం సిద్ధం అయ్యింది.. డీజిల్ ధరల పెరుగుదలతో ఛార్జీలు పెంచేందుకు ఏపీఎస్ఆర్టీసీ చర్యలు చేపట్టింది.. బస్సు ఛార్జీల పెంపునకు…
సీఎం వైఎస్ జగన్ నమ్మకాన్ని వమ్ము చేయను.. రాష్ట్రంలో ఉన్న వనరులను ఉపయోగించి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు మంత్రి ఆర్కే రోజా… సచివాలయంలోని రెండో బ్లాకులోని టూరిజం మంత్రి శాఖ చాంబర్లో పదవీ బాధ్యతలు స్వీకరించారు.. బాధ్యతలు స్వీకరించే ముందు సీఎం వైఎస్ జగన్‌ను కలిసి వచ్చారు.. బాధ్యతలు స్వీకరించేముందు గుమ్మడికాయతో దిష్టి తీశారు రోజా భర్త సెల్వమణి.. మంత్రి చాంబర్లో చైర్లో కూర్చొన్న తర్వాత తల్లికి ముద్దు పెట్టారు రోజా కూతురు… ఇక, ఈ…
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణ అధికార పార్టీలోని అసంతృప్తులను బయటపెట్టింది.. కేబినెట్లో స్థానం కోల్పోయినవారిని, పదవి ఆశించి నిరాశ ఎదురై అసంతృప్తిగా ఉన్న నేతలను పార్టీ అధిష్టానం బుజ్జగించి.. మళ్లీ అందరినీ లైన్లోకి తీసుకొచ్చింది.. అయితే, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అలియాస్ ఆర్కే కూడా పదవి ఆశించారని.. మంత్రి పదవిరాకపోవడంతో అలకబూనారనే వార్తలు వచ్చాయి.. దీనిపై క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్యే ఆర్కే.. నేను మంత్రి పదవి ఆశించలేదని స్పష్టం చేసిన ఆయన.. సామాజిక సమీకరణాల నేపథ్యంలో…
ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో చోటు దక్కించుకున్న ధర్మాన ప్రసాదరావు.. కీలకమైన రెవెన్యూ శాఖ మంత్రిగా నియమితులయ్యారు.. ఇక, ఇవాళ రెవెన్యూ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ధర్మాన ప్రసాదరావు.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. సీఎం వైఎస్ జగన్ లక్ష్యాలు నెరవేరుస్తామని ప్రకటించారు.. రెవెన్యూ అని కాకుండా ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అంటే బావుండేదన్న ఆయన.. సీనియర్ అధికారులతో కలిసి ఒక టీంగా పని చేయడం నా అలవాటు అన్నారు.. అనేక చట్టాల వల్ల చాలా భూములు వివాదాల్లో చిక్కుకుంటాయి.. దీని…