సోషల్ మీడియాను కొందరు మంచి పనుల కోసం వినియోగిస్తోంటే, మరికొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. కొందరైతే ఏకంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. అందమైన అమ్మాయిల్ని టార్గెట్ చేసి రిక్వెస్టులు పెట్టడం, యాక్సెప్ట్ చేశాక మాయమాటలు చెప్పి వలలో వేసుకోవడం, ఆ తర్వాత బ్లాక్‌మెయిల్‌కి పాల్పడ్డం లాంటివి చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే ఎన్నో చోటు చేసుకోగా, తాజాగా మరో వ్యవహారం తెరమీదకొచ్చింది.
Read Also: YCP Leader Murder Case: పథకం ప్రకారమే వైసీపీ నేత హత్య..
ఆ అబ్బాయి పేరు శానవాజ్. ఏలూరుకి చెందిన ఓ అమ్మాయితో ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకున్నాడు. తొలుత మాయమాటలు చెప్పి, ఆమెని తన బుట్టలో పడేసుకున్నాడు. పాపం, ఆ అమ్మాయి అతడ్ని నమ్మి, అడిగిన వెంటనే ఫోటోలు పంపించింది. అప్పుడే అతడు తన నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు. తాను అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించడం మొదలుపెట్టాడు. తాను మోసపోయానని గ్రహించిన ఆ అమ్మాయి, మరో దారి లేక అతనికి డబ్బులిచ్చింది.
అయినప్పటికీ శానవాజ్ ఆ యువతి ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో, ఆ యువతి అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు, పోలీస్ స్టేషన్ సమీపంలోనే చెప్పుతో కొట్టి, అతనికి తగిన గుణపాఠం నేర్పింది. సైబర్ నేరాలు ఎన్నో వెలుగుచూస్తోన్నా, అమ్మాయిలు ఆకతాయిల వలలో చిక్కుకుంటూనే ఉన్నారు. ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలని సూచిస్తున్నారు.