Exams: ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం.. నో ఫోన్ జోన్లుగా టెన్త్ పరీక్షా కేంద్రాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల్లో ప్రతిరోజూ పేపర్ లీక్ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అయితే అవి పేపర్ లీక్‌లు కాదని మాస్ కాపీయింగ్ జరుగుతోందని విద్యాశాఖ వివరణ ఇస్తోంది. ఈ నేపథ్యంలో పేపర్ లీక్, మాస్ కాపీయింగ్ లాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ అరికట్టేలా చర్యలు చేపట్టింది. పదో తరగతి పరీక్షా కేంద్రాలను నో-ఫోన్ జోన్లుగా ప్రకటించింది. పాఠశాల చీఫ్ సూపరింటెండెంట్ల ఫోన్‌లను కూడా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేందుకు నిరాకరించింది.
పరీక్షా కేంద్రాల్లో ఫోన్లు సహా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఏమైనా కన్పిస్తే వెంటనే జప్తు చేస్తామని విద్యాశాఖ హెచ్చరికలు జారీ చేసింది. స్మార్ట్ వాచ్, ఇయర్ ఫోన్లు, ఐపాడ్లు కూడా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించేదే లేదని స్పష్టం చేసింది. క్వశ్చన్ పేపర్లోని ప్రతి పేజీ మీద సెంటర్ నెంబర్, రోల్ నెంబర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇన్విజిలెటర్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రశ్నాపత్రాలు ఇవ్వగానే అభ్యర్థులతో సెంటర్ నెంబర్, రోల్ నెంబర్ రాయించాలని సూచించింది. పరీక్ష నిర్వహణలో ఎవరైనా తప్పిదాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Also Read
Andhra Pradesh: 52 మంది అదనపు ఎస్పీల బదిలీలు.. ఉత్తర్వులు జారీ
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!