ఏపీలో పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేతలు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శనివారం నాడు ఏలూరు జాతీయ రహదారిపై వినూత్నంగా నిరసన చేపట్టారు. బస్సుల్లో వెళ్తున్న ప్రయాణికులకు ఒక్కొక్కరికి రూ.20 నోటుతో పాటు ఓ మజ్జిగ ప్యాకెట్ అందించారు. పెంచిన ఛార్జీలను ప్రయాణికులు భరించలేకపోతున్నారని చెప్పేందుకు రూ.20 ఇచ్చినట్లు చింతమనేని ప్రభాకర్ తెలిపారు. మరోవైపు ఉగాది సందర్భంగా విద్యుత్ ఛార్జీలను…
వైసీపీ కార్యకర్తపై మంత్రి ధర్మాన చేయి చేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా ధర్మాన ప్రసాదరావు శుక్రవారం నాడు శ్రీకాకుళంలో పర్యటించారు. దాదాపు 8 ఏళ్ల తర్వాత మళ్లీ మంత్రి పదవి చేపట్టిన ధర్మాన ప్రసాదరావును కలిసేందుకు భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మానతో కరచాలనం చేసేందుకు వైసీపీ కార్యకర్తలు పోటీ పడ్డారు. ఈ సమయంలో ఓ వైసీపీ కార్యకర్త మంత్రి ధర్మాన…
అమరావతి: సచివాలయంలోని తన కార్యాలయంలో కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ఈరోజు ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రెండు కీలక ఫైళ్లపై ఆయన తొలి రెండు సంతకాలను చేశారు. తొలి సంతకాన్ని విశాఖలో లక్ష మంది మహిళలకు ఇళ్ళు కట్టించే ఫైలుపై చేశారు. రెండో సంతకాన్ని గృహ నిర్మాణ లబ్దిదారులకు ఇచ్చే 90 బస్తాల సిమెంట్ను 140 బస్తాలకు పెంచే ఫైలుపై చేశారు. అనంతరం సీఎం…
తిరుపతిలో వైసీపీ జాబ్ మేళా సందర్భంగా విజయసాయిరెడ్డి చేసిన కామెంట్లపై బండ్ల గణేష్ ఫైర్ అయ్యాడు. ఒక వ్యక్తితో ఉన్న వైరాన్ని కులానికి ఆపాదిస్తే చెప్పుదెబ్బలు ఖాయమని హెచ్చరించాడు. కమ్మవారిని కులం పేరుతో తిట్టడం తగదని, చెల్లెల్ని అన్న నుంచి దూరం చేసిన దగుల్బాజీ అని విజయసాయిరెడ్డిపై బండ్ల గణేష్ విమర్శలు చేశాడు. అంతేకాకుండా విజయసాయిరెడ్డి విషసాయి అంటూ ఆరోపించాడు. అయితే బండ్ల గణేష్కు తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘ఆకులు..వక్కలు..పక్కలు…ఇదేగా నీ బతుకు..…
రెవిన్యూ శాఖలో చాలా సమస్యలు ఉన్నాయన్నారు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు. అవినితి ఎక్కువగా ఉందని, ఇది అవమానకరంగా ఉందన్నారాయన.. అందుకే అనేక పథకాలను.. లబ్ధిదారులకే నేరుగా ప్రభుత్వం అందిస్తుందని వివరించారు. అయితే, ఇదే సందర్భంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ధర్మాన.. ప్రజలు నిజాయితీ కలిగిన నాయకులను కోరుకుంటున్నారు. ఒడిశాలో నవీన్ పట్నాయక్ ను ప్రజలు నాలుగు సార్లు ముఖ్యమంత్రిని చేశారని గుర్తుచేసిన ఆయన.. ఇది కేవలం ఆయన నిజాయితీవల్లే సాధ్యమైందన్నారు. ఢిల్లీలో ఆప్…
నెల్లూరులో వైసీపీ రాజకీయం మరింత వేడెక్కుతోంది. రేవు జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి అనిల్ కుమార్ పరిశీలించారు. ఈ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని అనుచరులను ఆదేశించారు. రాత్రి భోజనంతో పాటు ఇఫ్తార్ విందుకు ఏర్పాట్లు చేయాలని వారికి సూచించారు. నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్కు మాజీ మంత్రి అనిల్ కుమార్తో పాటు పలువురు నేతలు చేరుకున్నారు. దీంతో.. నెల్లూరు వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నట్టు అయ్యింది.. కాకాణి, మాజీ మంత్రి అనిల్ మధ్య వివాదం…
వైఎస్ జగన్ కేసుల్లోనూ సాక్ష్యాలు ఎత్తుకెళ్లే ప్రమాదం ఉంది భద్రత పెంచండి అంటూ సీబీఐ అధికారులకు సూచించారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.. కాకాని కేసులో సాక్ష్యాలని కోర్టు నుంచే దొంగిలించడం దుర్మార్గం అని పేర్కొన్న ఆయన.. కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి పదవి పోతుందనే భయంతోనే కోర్టులో ఉన్న సాక్ష్యాలను దొంగిలించారని ఆరోపించారు. జగన్ కేసుల్లో కూడా సాక్ష్యాలు ఎత్తుకెళ్లే ప్రమాదం ఉంది.. సీబీఐ వాళ్లు ఆ సాక్ష్యాలకు మరింత భద్రత ఏర్పాటు చేయాలన్నారు.. వైఎస్…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ విజయసాయిరెడ్డిపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు సినీ నిర్మాత బండ్ల గణేష్.. కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన ఆయన.. వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు.. మీకు కులం నచ్చకుంటే, కమ్మ వాళ్లు నచ్చకుంటే నేరుగా తిట్టoడి. కానీ, చంద్రబాబును టీడీపీని అడ్డం పెట్టుకొని కమ్మవారిని తిట్టకండి అని సలహా ఇచ్చారు. అధికారం శాశ్వతం కాదు, రేపు నువ్వు తప్పకుండా మాజీ అవుతావు అని…
తెలుగు రాష్ట్రాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. నగరంపై ఆకాశం మేఘావృతమై ఉంది. ఓ మోస్తరు వర్షం కురవడంతో సిటీ వెదర్ ఒక్కసారిగా చల్లబడింది. దాంతో ఉక్కపోత నుంచి నగరవాసులకు ఉపశమనం లభించింది. మరోవైపు నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణలో ఏప్రిల్ 18 వరకూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.…
* నేడు గుజరాత్లో 108 అడుగుల హనుమాన్ విగ్రహావిష్కరణ, ఉదయం 11 గంటలకు వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ * నేడు సీఎం జగన్ కర్నూలు పర్యటన, వైసీపీ నేత ప్రదీప్ రెడ్డి కుమారుని పెళ్లి వేడుకల్లో పాల్గొననున్న సీఎం జగన్ * తిరుపతి: నేడు ఎస్వీ యూనివర్సిటీలో జాబ్ మేళా.. నేటి నుంచి రెండు రోజుల పాటు జాబ్ మేళా, పాల్గొననున్న 137 కంపెనీలు, ఇప్పటి వరకు 1.34 లక్షల మంది రిజిస్ట్రేషన్ * నేడు…