వైసీపీలో మంత్రి పదవి దక్కని నేతల్లో అసంతృప్తి ఇంకా చల్లారడం లేదు. తాజాగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కోటవురట్లలో సోమవారం వాలంటీర్లకు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కేబినెట్లో చోటు విషయంపై తనకు ముమ్మాటికీ అన్యాయం జరిగిందన్నారు. మంత్రి పదవి ఇవ్వకుండా అధిష్టానం దెబ్బకొట్టిందని.. తానూ అవకాశం వచ్చినప్పుడు దెబ్బకొడతానని అన్నారు. వైఎస్ఆర్ చనిపోయిన తరువాత హింసావాదంతో తాను జగన్ ఏర్పాటు చేసిన వైసీపీలో జాయిన్…
కళ్యాణదుర్గంలో తన ర్యాలీలో ఓ చిన్నారి మృతి పట్ల మంత్రి ఉషశ్రీచరణ్ స్పందిస్తూ.. చిన్నారిని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలు శవరాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. వైసీపీ ప్రభంజనానికి భయపడి శవరాజకీయం చేస్తున్న వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నానని.. వారిని ఆంజనేయస్వామే చూసుకుంటాడని వ్యాఖ్యలు చేశారు. అయితే మంత్రి ఉషశ్రీచరణ్ వ్యాఖ్యలకు టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తండ్రి చనిపోతే మూడేళ్ల పాటు శవ రాజకీయాలు చేసింది జగన్మోహన్రెడ్డి అని జేసీ ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. తాడిపత్రికి…
ఏపీకి భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుభవార్త అందించింది. ఏటా జూన్ నుంచి మొదలయ్యే నైరుతి రుతుపవనాల సీజన్లో దేశ వ్యాప్తంగా ఈ ఏడాది సాధారణ వర్షాలు కురుస్తాయని చెప్పిన ఐఎండీ.. ఏపీలో మాత్రం సాధారణం కంటే అధికంగా వర్షాలు పడతాయని తెలిపింది. గడిచిన మూడేళ్లుగా ఏపీలో అటు నైరుతి, ఇటు ఈశాన్య రుతుపవనాల సీజన్లో మంచి వర్షాలే పడుతున్నాయి. ఫలితంగా పంటల దిగుబడులు ఆశాజనకంగా ఉంటున్నాయి. గత ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో సాధారణం కంటే…
నేడు ఏపీ సీఎం జగన్ విశాఖ వెళ్లనున్నారు. విశాఖలో ఆయమన హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సమావేశం కానున్నారు. సుమారు రెండు గంటల పర్యటన కోసం సీఎం జగన్ విశాఖకు వెళ్తున్నారు. ఉ.11:10 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న ఆయన అక్కడ సుమారు గంటల పాటు జిల్లా నాయకులతో భేటీ కానున్నారు. అనంతరం రుషికొండలోని పెమా వెల్నెస్ సెంటర్‌కు వెళ్లి అక్కడ నేచురోపతి ట్రీట్మెంట్ తీసుకుంటున్న హర్యానా సీఎంను కలవనున్నారు. మధ్యాహ్నం 1:20 గంటలకు జగన్ తాడేపల్లికి…
★ విశాఖలో నేడు సీఎం జగన్ పర్యటన.. నేడు హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌తో భేటీ కానున్న సీఎం జగన్ ★ విశాఖ: నేటి నుంచి రెండు రోజుల పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన.. పద్మనాభం మండలం పాండ్రంగిలో అల్లూరి సీతారామరాజు స్వస్థలం, ఇంటిని సందర్శించనున్న వెంకయ్య.. సాయంత్రం ప్రేమ సమాజం వేడుకల్లో పాల్గొననున్న ఉపరాష్ట్రపతి ★ గుంటూరు: చెరుకుపల్లిలో నేడు గ్రామ వాలంటీర్లకు సన్మాన కార్యక్రమం.. హాజరుకానున్న రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు ★ శ్రీకాకుళం:…
నెల్లూరు కోర్టులో దొంగలు పడడం కలకలం సృష్టించింది.. ఈ కేసును ఛేదించిన పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేశారు.. అయితే, నెల్లూరు ఎస్పీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ.. నెల్లూరు కోర్టులో కాకాని ఫైల్ మాత్రమే దొంగలు ఎలా దొంగతనం చేస్తారు..? అని ప్రశ్నించారు.. ఎన్నో ఫైళ్లు ఉండే కోర్టులో ఒక కాకాని ఫైల్ మాత్రమే దొంగలకు దొరికిందా..? నెల్లూరు ఎస్పీ ఖాకి డ్రెస్ వేసుకున్నారా..? లేదా..? అనే అనుమానం కలుగుతోంది అంటూ ఆగ్రహం వ్యక్తం…
ప్రతి పార్లమెంట్ పరిధిలో మెడికల్ కాలేజీలు రాబోతున్నాయని తెలిపారు మంత్రి విడదల రజనీ… సచివాలయంలో తన చాంబర్లో ప్రత్యేక పూజలు చేశారు.. తన పిల్లలతో కలిసి సచివాలయానికి వచ్చిన ఆమె వైద్యారోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైద్యారోగ్య శాఖకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. మెడికల్ సర్వీసెస్ విషయంలో ఏపీ ఐకాన్‌గా నిలుస్తోందని.. ఏపీలో అందుతున్న వైద్య సేవల పట్ల కేంద్రం నుంచి ప్రశంసలు అందుతున్నాయని వెల్లడించారు. Read Also: Harish Rao:…
మర్మం లేకుండా మాట్లాడేస్తారు. మెలితిప్పే కామెంట్స్ అస్సలు ఉండవు. సూటిగా సుత్తిలేకుండా చెప్పేస్తారు. ఇన్నాళ్లూ ఆయన ఏం చెప్పినా చర్చే. ఇప్పుడు మాత్రం ఆయన మంత్రి. అభినందన సభలోనే నర్మగర్భ వ్యాఖ్యలతో కలకలం రేపారు. కాకపోతే ఆ ధర్మ సూక్తులు ఎవరికన్నదే ప్రస్తుతం ప్రశ్న. హాట్ టాపిక్‌గా మంత్రి ధర్మాన కామెంట్స్ ధర్మాన ప్రసాదరావు. తాజా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో చోటు దక్కించుకున్నారు. చాలా గ్యాప్ తర్వాత మంత్రి హోదాలో జిల్లాకు రావడంతో అభిమానులు, పార్టీ కార్యకర్తలు శ్రీకాకుళం…
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌పై మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. ఇవాళ సచివాలయంలోని తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం… దేవుడి ఫొటో బదులు సీఎం జగన్ ఫొటో పట్టుకుని చాంబర్లోకి ప్రవేశించారు.. చాంబర్లో ప్రత్యేక పూజల తర్వాత బాధ్యతలు స్వీకరించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్లు చేశారు.. ఇది రెడ్ల రాజ్యం కాదు.. బడుగుల రాజ్యం.. జగన్ ప్రభుత్వంలో బడుగులకే ప్రాధాన్యం ఇస్తున్నారని.. ఇక, బడుగులకు జగన్…