ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కాస్త గ్యాస్ తీసుకుని వరుసగా పరులు పెడుతూ పోయిన పెట్రో ధరలకు మళ్లీ బ్రేక్‌లు పడ్డాయి.. దేశంలో పెట్రో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ 119 రూపాయల 49 పైసలుగా ఉంటే డీజిల్ 105 రూపాయల 49 పైసలుగా ఉంది. విశాఖలో 120 రూపాయలు, విజయవాడలో 121 రూపాయలు, కర్నూలులో 121 రూపాయల 79 పైసలుగా ఉంది. విశాఖలో లీటర్ డీజిల్ ధర 105 రూపాయల 65 పైసలుగా…
* నేటి నుంచి మూడ్రోజుల పాటు గుజరాత్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన, నేడు గాంధీనగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న ప్రధాని * నేడు ఢిల్లీలో పంజాబ్ ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటన.. స్కూళ్లు, ఆస్పత్రులను సందర్శించనున్న పంజాబ్ సీఎం బృందం * నేడు మచిలీపట్నంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన, పిన్నమనేని విగ్రహాన్ని ఆవిష్కరించనున్న వెంకయ్య * నేడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంత్రి కేటీఆర్ భేటీ, టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలపై చర్చించనున్న…
ఏపీలో ప్రస్తుతం నెల్లూరు రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, కొత్త మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితులు నెల్లూరులో నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ పోటాపోటీగా సభలు నిర్వహిస్తున్నారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి పర్యటన సందర్భంగా నెల్లూరు నగరంలో ఆయన అనుచరులు భారీ ర్యాలీ నిర్వహించాలని తలపెట్టారు. అంతేకాకుండా భారీగా స్వాగత ఏర్పాట్లు కూడా చేశారు.…
అనకాపల్లి జిల్లాలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై మరో కేసు నమోదైంది. పోలీసులను దుర్భాషలాడటం, దురుసుగా ప్రవర్తించడంపై అధికారులు విచారించి సెక్షన్ 353తో పాటు మరికొన్ని సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే… రెండు రోజుల క్రితం నర్సీపట్నం గ్రామదేవత ఉత్సవాల్లో కొందరు యువకుల దూకుడు కారణంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎట్టిపరిస్థితుల్లోనూ రాత్రి 11 గంటల తర్వాత జరపడానికి వీల్లేదంటూ…
ఏపీలోని విజయవాడ నుంచి కర్ణాటకలోని బెంగళూరు వరకు కొత్తగా జాతీయ రహదారి ఏర్పడనుంది. బెంగళూరు, కడప, విజయవాడను కలుపుతూ గ్రీన్ ఫీల్డ్ హైవే ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ హైవేపై 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా అధికారులు రహదారిని నిర్మించనున్నారు. సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కోడూరు నుంచి ప్రకాశం జిల్లా ముప్పవరం వరకు నాలుగు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేగా నిర్మించనున్నారు. దీంతో ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. ఈ జాతీయ…
* ఐపీఎల్లో నేడు తొలి మ్యాచ్‌లో తలపడనున్న పంజాబ్- హైదరాబాద్, మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం. * ఐపీఎల్లో నేడు రెండో మ్యాచ్‌లో గుజరాత్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్, రాత్రి 7.30 గంటలకు ప్రారంభం. * గుంటూరు జిల్లా జూపూడిలో 4వ రోజు కొనసాగుతున్న పోలీస్ పికెటింగ్.. * ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నేడు పీపుల్స్ వార్ వ్యవస్థాపకుడు, దళిత విప్లవ కవి కేజీ సత్యమూర్తి స్మారక సభ.. * ప్రకాశం జిల్లా మార్కాపురం…
జాతీయ స్థాయిలో ఏపీ మరోసారి సత్తా చాటింది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న రెండు పథకాలకు కేంద్ర నుంచి గుర్తింపు లభించింది. టెలీ కన్సల్టేషన్ ద్వారా వైద్య సేవలు అందించడంలో ముందున్న వైద్య ఆరోగ్యశాఖకు జాతీయస్థాయిలో తొలి ర్యాంకు లభించింది. ప్రతిరోజూ టెలీ కన్సల్టేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా 1.3 లక్షల మందికి వైద్య సేవలు అందుతున్నాయి. ఇందులో ఏపీకి సంబంధించి సుమారు 70వేల మందికి 27 హబ్స్‌లలో వైద్యుల నుంచి టెలీ కన్సల్టేషన్ ద్వారా…
రవాణా శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆర్టీసీ ఛార్జీలు పెంచాల్సి రావటం బాధాకరంగా ఉందని మంత్రి విశ్వరూప్ వ్యాఖ్యానించారు. శనివారం అన్నవరం సత్యదేవుడిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలపై ఛార్జీల భారం మోపడం బాధగానే ఉన్నా.. తప్పనిసరి పరిస్థితుల్లో అనివార్యంగా ఛార్జీల పెంపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. తెలంగాణతో పోలిస్తే ఏపీలోనే ఆర్టీసీ బస్సు ఛార్జీలు తక్కువగా ఉన్నాయని మంత్రి విశ్వరూప్ వెల్లడించారు. ప్రస్తుతం డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న కారణంగా…
జగన్ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర ఆరోపణలు చేశారు. జిల్లా కార్యాలయాల నిర్వహణకు దేవాలయాల నిధులిస్తే ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని సోము వీర్రాజు హెచ్చరించారు. కొత్త జిల్లాలలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటుకు హిందూ దేవాలయాలు నుంచి నిధులు ఇవ్వడమేంటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు కోసం దేవాలయాల నుంచి నిధులు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామని సోము వీర్రాజు స్పష్టం చేశారు. అమ్మఒడి గత ఏడాది ఇవ్వలేదని.. ఈ ఏడాది…