సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారంపై గురువారం ఉదయం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై వాదోపవాదాలు జరిగాయి. ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎంతకాలం కొనసాగిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రెండేళ్లకు మించి సస్పెన్షన్ చేయకూడదన్న నిబంధనలు గమనించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన నిర్దేశాలు కోరామని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు. సస్పెన్షన్ కొనసాగించేందుకు నిర్దేశాలు కోరినట్లు…
విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తున్న ప్రియుడిని కలిసేందుకు వెళ్లిన వాంబే కాలనీ అమ్మాయిపై తన స్నేహితులతో కలిసి ప్రియుడు అత్యాచారం చేయడం స్థానికంగా కలకలం రేపింది. ప్రియుడితో పాటు అతడి ఇద్దరి స్నేహితులు కలిసి ఆస్పత్రిలోనే యువతిపై గ్యాంగ్ రేప్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తన కుమార్తెపై విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ముగ్గురు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారని ఎన్టీవీతో బాధితురాలి తల్లి వెల్లడించింది.…
అమరావతి సచివాలయంలో నూతన వ్యవసాయ శాఖ మంత్రిగా కాకాణి గోవర్ధన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన రూ.1,395 కోట్లతో 3.75 లక్షల ఎకరాలకు మైక్రో ఇర్రిగేషన్ అవకాశం కల్పించే ఫైలుపై మొదటి సంతకం చేశారు. అంతేకాకుండా 3500 ట్రాక్టర్లను వైఎస్ఆర్ యంత్ర పథకం కింద ఇచ్చే ఫైలుపై రెండో సంతకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ మంత్రిగా తనకు అవకాశం ఇచ్చిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 43 వేల…
ఏలూరు జిల్లాలోని ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగూడెం గ్రామంలో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన గ్రామ సభలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తనకు మాట్లాడే అవకాశం కల్పించాలంటూ గ్రామ సభకు వచ్చిన వైసీపీ ఎంపీటీసీ కాజా రాంబాబు విజ్ఞప్తి చేశారు. తాను వైసీపీలోనే ఉంటూ గ్రామంలో జరిగిన రూ.75 లక్షల అవినీతిపై పోరాడుతున్నట్లు రాంబాబు చెప్పడంతో చంద్రబాబు ఆయనకు మాట్లాడే అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకా ప్రతాప్ తనయుడు అవినీతికి పాల్పడ్డాడంటూ చంద్రబాబుకు…
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న శ్రీశైలం జలాశయానికి అంచనాలకు మించి వచ్చే వరద నీటిని మళ్లించడానికి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని నిపుణుల కమిటీ హెచ్చరించింది. లేకపోతే శ్రీశైలం డ్యామ్ భద్రతకే ముప్పు వాటిల్లుతుందని కమిటీ స్పష్టం చేసింది. కొత్తగా స్పిల్ వే నిర్మించడం లేదా డ్యాం ఎత్తు పెంచడం, కుడి కాల్వ, ఎడమ కాల్వల నుంచి నీటిని మళ్లించేందుకు ఏర్పాట్లు చేయడం వంటి అంశాలను పరిశీలించాలని నిపుణుల కమిటీ కీలక సూచనలు చేసింది. ప్లంజ్‌పూల్ సహా…
★ నేడు తూ.గో. జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. బలభద్రపురంలో గ్రాసిమ్ ఇండస్ట్రీ కంపెనీ యూనిట్‌ను ప్రారంభించనున్న సీఎం జగన్ ★ ఒంగోలులో నేడు బీజేపీ మహాధర్నా.. బీజేపీ కార్యకర్తలపై పెట్టిన కేసులకు నిరసనగా ధర్నా ★ నేడు గద్వాలకు చేరుకోనున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర.. ఈరోజు సాయంత్రం గద్వాల మైదానంలో బీజేపీ భారీ బహిరంగ సభ ★ సికింద్రాబాద్ సీటీవో జంక్షన్లో నేటి నుంచి జూన్ 4 వరకు…
జగన్ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో రేషన్ బియ్యం బదులు ప్రజలకు నగదు ఇస్తామని ప్రభుత్వం చెప్పడంలో కుట్ర కోణం దాగి ఉందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం పేదల జీవితాలతో ఆటలాడుతోందంటూ మండిపడ్డారు. నగదు బదిలీ విషయంలో ప్రజలపై బలవంతంగా ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోందని విమర్శలు చేశారు. ఈ అంశంపై అధికారులు సర్వే నిర్వహిస్తే ఎక్కువ మంది బియ్యమే కావాలని కోరుతున్నారని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. ఉదాహరణకు…
కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ తర్వాత వైసీపీ నేతల్లో అసమ్మతి బయటపడింది. పలు చోట్ల ఆ పార్టీ నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. ఈ జాబితాలో మేకతోటి సుచరిత, అనిల్ కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి వంటి మాజీ మంత్రులతో పాటు గొల్ల బాబూరావు, పార్థసారథి, సామినేని ఉదయభాను వంటి కీలక నేతలు ఉన్నారు. ఈ అసమ్మతి వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో సీఎం జగన్ వెంటనే మేల్కొన్నారు. పార్టీలో వివాదాలను పరిష్కరించడంపై ఫోకస్…
ఏపీలో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఈ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈరోజు చంద్రబాబు 73వ పుట్టినరోజు. తన బర్త్ డే నుంచే ప్రజాక్షేత్రంలోకి చంద్రబాబు ఎంటర్ అవుతున్నారు. ఈ మేరకు ఈరోజు ఏలూరు జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగుడెం గ్రామంలో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకోనున్నారు. అడవినెక్కలం అంబేద్కర్ నగర్ నుంచి నెక్కలం గొల్లగూడెం వరకు చంద్రబాబు పాదయాత్ర…