తిరుపతి జిల్లా తొలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సీఎం వైఎస్ జగన్ అవకాశం ఇచ్చారు.. ఆయన సైనికుడిగా పనిచేస్తానని వెల్లడించారు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి.. తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఆయనను నియమించిన విషయం తెలిసిందే కాదు.. ఆత్మీయ సమావేశం నిర్వహించాం.. జగనన్న అవకాశం ఇచ్చారు.. అందరినీ కలుపుకుని, పార్టీని మరింత బలపేతం చేస్తానని వెల్లడించారు.. ప్రతి పల్లెలోకి వెళ్తాం… ప్రజలు చేత ఎన్నుకోబడిన ప్రతి ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామన్నారు.. ప్రతి మండలంలో వైఎ్సార్సీపీ సర్వసభ్య…
సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. మళ్లీ ఆయన్ను సర్వీస్‌లోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీని తోసిపుచ్చింది సుప్రీం.. అయితే, హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఈ పరిణామంతో ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట లభించగా.. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు.. సీరియస్‌గా స్పందించారు. ఏపీ ప్రభుత్వ స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసిందని.. ఆంద్రప్రదేశ్…
శాప్ ఛైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బైరెడ్డి సిద్దార్థరెడ్డికి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియతో పాటు మీడియాను షేక్ చేస్తోంది.. నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థర్‌తో బైరెడ్డికి విభేదాలు బహిరంగ రహస్యమే కాగా.. ఈ మధ్య ఓ పరిణామం చర్చకు దారితీసింది.. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు బైరెడ్డి సిద్ధం అవుతున్నారని.. అందులో భాగంగానే ఈ మధ్యే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో భేటీ అయ్యారనే వార్తలు గుప్పుమన్నాయి.. అంతేకాదు.. టీడీపీలో చేరి…
ప్రకాశం జిల్లా ఒంగోలులో సున్నా వడ్డీ పథకం కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరుసగా మూడో ఏడాది సున్నా వడ్డీ పథకం కింద నిధులను ఆయన జమ చేశారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ ప్రతిపక్షాలపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వంపై చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా గోబెల్స్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఉచిత పథకాలతో ఆర్థిక విధ్వంసమంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తాము రాక్షసులు,…
విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో అత్యాచార బాధిత కుటుంబాన్ని శుక్రవారం మధ్యాహ్నం టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వాసుపత్రిలో ఓ యువతిపై సామూహిక అత్యాచారం చేయటం ఏపీకే అవమానం అని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కరువైందని.. ఈ సంఘటన పట్ల ప్రభుత్వానికి సిగ్గుందో లేదో కానీ తాను మాత్రం సిగ్గుపడుతున్నానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇంత జరిగినా…
ఏపీ సీఎం జగన్ త్వరలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. సీఎం హోదాలో జగన్ తొలిసారి అధికారికంగా విదేశీ పర్యటన చేయబోతున్నారు. సీఎం అయిన తరువాత జగన్ లండన్, అమెరికా వెళ్లినా అది పూర్తిగా వ్యక్తిగత పర్యటనగానే పరిమితమైంది. అయితే ఇప్పుడు సీఎం హోదాలో జగన్ దావోస్ వెళ్లనున్నారు. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు దావోస్ కేంద్రంగా జరిగే వరల్డ్ ఎకానమిక్ ఫోరం సమ్మిట్‌లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పలువురు వ్యాపారవేత్తలతో భేటీ కానున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను…
ఏపీలో పరీక్షలకు సిద్ధమవుతున్న పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ శుభవార్త అందించింది. గురువారం పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులతో సమీక్ష జరిపారు. ఈ మేరకు పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ఆర్టీసీ ప్రకటన చేసింది. పరీక్షల సమయంలో విద్యా కేంద్రం నుంచి పరీక్షా కేంద్రానికి వెళ్లి పరీక్ష రాసిన అనంతరం మళ్లీ తిరుగు ప్రయాణం ఉచితంగా చేయవచ్చని సూచించింది. ఉచిత ప్రయాణం చేయాలంటే…
ఏపీ దేవాదాయ శాఖలో డిప్యుటేషన్ పేరుతో రెవెన్యూ అధికారుల పెత్తనానికి బ్రేకులు పడనున్నాయ్. ప్రధాన ఆలయాలకు ఈవోలుగా డిప్యూటీ కలెక్టర్లను నియమించే విధానానికి ప్రభుత్వం స్వస్తి పలకనుంది. నిబంధనలు ఉల్లంఘించి చేపట్టిన నియమకాలపై సుదీర్ఘంగా న్యాయ వివాదం జరగ్గా చివరకు దేవాదాయ శాఖ ఉద్యోగులకు ఊరట లభించింది. రాష్ట్రంలో 8 ప్రధాన ఆలయాలు దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్నాయి. వీటిలో సింహాచలం, కాణిపాకం, ద్వారకా తిరుమల, శ్రీశైలం, శ్రీకాళహస్తి ముఖ్యమైనవి. ఈ ఆలయాలకు వచ్చే భక్తుల…
గుడివాడలో అధికార పార్టీకి చెందిన మట్టి మాఫియా చెలరేగిపోతోంది. మండలంలోని మోటూరు గ్రామంలో జరుగుతున్న అక్రమ తవ్వకాలను అడ్డుకున్న రెవెన్యూ అధికారులపై మైనింగ్ మాఫియా దాడికి దిగింది. గుడివాడ మండలం మోటూరు గ్రామంలో గత కొన్ని రోజులుగా రాత్రిళ్ళు జరుగుతున్న మట్టి తవ్వకాలపై రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించడంతో తవ్వకాలను అడ్డుకున్న ఆర్ఐ అరవింద్‌పై దాడికి దిగారు. మోటూరు గ్రామంలోని కాలువల వెంట మట్టి తవ్వకాలు జరుగుతుండగా తన సిబ్బందితో కలిసి ఆర్ఐ అరవింద్ అడ్డుకోవడంతో ఎదురుతిరిగిన…