TTD Hundi Collection New Record: టీటీడీ కొత్త చరిత్ర.. 21 రోజులకే రూ.100 కోట్లు దాటి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల తిరుపతి దేవస్థానం హుండీ ఆదాయంలో కొత్త రికార్డు సృష్టించింది.. జులై మాసంలో కోనేటిరాయుడికీ కాసుల వర్షం కురుస్తోంది.. ఈ నెలలో కేవలం 21 రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసింది శ్రీవారి హుండీ ఆదాయం.. జులై 1వ తేదీ నుంచి 21వ తేదీ వరకు శ్రీవారికీ హుండీ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ. 100 కోట్ల 75 లక్షల రూపాయల ఆదాయంగా వచ్చింది.. జులై మాసంలో స్వామివారికి ఇంత మొత్తంలో హుండీ ఆదాయం లభించడం ఇదే తొలిసారి.. ఇక, టీటీడీ చరిత్రలోకే అత్యధిక స్థాయిలో ఆదాయం జులై మాసంలో లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు.. ఇప్పటి వరకు గత మే మాసంలో లభించిన 130 కోట్ల రూపాయలే అత్యధిక హుండీ ఆదాయం కాగా.. ఈ నెల 31వ తేదీ వరకు మరింత ఆదాయం వస్తుంది కాబట్టి.. మొట్ట మొదటి సారి హుండీ ద్వారా ఒకే మాసంలో 140 కోట్ల రూపాయలు ఆదాయం శ్రీవారికి లభించే అవకాశం ఉందంటున్నారు.
Read Also: CJI Justice NV Ramana: మీడియా కంగారు కోర్టులను నడిపిస్తోంది.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఫైర్
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
కరోనా మహమ్మారవి విజృంభణ తర్వాత చాలా కాలం శ్రీవారికి దూరం అయ్యారు సామాన్య భక్తులు.. దాదాపు రెండేళ్ల తర్వాత తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.. మరోవైపు హుండీలో కాసుల వర్షం కురుస్తోంది.. గత ఐదు నెలలుగా రూ.100 కోట్ల మార్క్‌ను దాటేసి కొత్త రికార్డులు సృష్టిస్తూ వస్తుంది టీటీడీ.. మార్చి నెలలో శ్రీవారికి రూ.128 కోట్ల ఆదాయం, ఏప్రిల్ రూ.127.5 కోట్లు, మే మాసంలో రికార్డు స్థాయిలో 130.05 కోట్ల , జూన్ మాసంలో రూ.123 కోట్ల ఆదాయం రాగా.. జులై మాసంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నప్పటికీ.. స్వామి వారి హుండీ ఆదాయం రికార్డులు సృష్టిస్తోంది.. ఈ నెలలోనే 4వ తేదీ టీటీడీ చరిత్రలోనే అత్యధికంగా రూ.6.18 కోట్ల ఆదాయం లభించింది.. దీంతో మరో పది రోజుల హుండీ ఆదాయం సరాసరి లెక్కించినా.. జులై మాసంలో టీటీడీ ఆదాయం కొత్త చరిత్ర లిఖిస్తుందని అంచనా వేస్తున్నారు.. ఐదు నెలల కాలంలోనే శ్రీవారి హుండీ ఆదాయం 650 కోట్ల రూపాయాలను క్రాస్ చేయగా.. ఈ ఏడాది మొత్తం ఆదయాం రూ. 15 వందల కోట్లును కూడా దాటేసే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు అధికారులు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!