కడప జిల్లాలో పోలీసులు సివిల్ పంచాయతీల్లో జోక్యంతో..ఒక మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుని చావు బ్రతుకుల కొట్టు మిట్టాడుతోంది. కడప జిల్లా వేముల మండలం వి. కొత్తపల్లి గ్రామానికి చెందిన వెంకట శివమ్మ అనే మహిళను పెండ్లిమర్రి ఎస్. ఐ రాజ రాజేశ్వరరెడ్డి తన పొలం పంచాయతీలో లంచం అడిగి వేధించాడని మనస్తాపానికి గురై ఆత్మహత్యా యత్నం చేసుకున్నట్లు బాధితులు మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య శివమ్మ తల్లిదండ్రులు లేకపోవడంతో తన పెద్దమ్మ పెంచి పోషించి తనకున్న మూడు ఎకరాల కులాన్ని తన పేరిట రాసిచ్చి నాకు పెళ్లి చేశారని బాధితురాలు శివమ్మ భర్త లక్ష్మీరెడ్డి తెలిపారు.
తమకు ఇచ్చిన ఆ భూమిలో ఒకటిన్నర ఎకరా పట్టా భూమి అని మరో ఒకటిన్నర డీకేటి భూమి అని తెలిపారు. తన బామ్మర్ది మల్లారెడ్డి ఎస్ ఐ రాజరాజేశ్వర్ రెడ్డి తో కలిసి డీకేటీ భూమిని ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గత ఏడాది కాలంగా పోలీస్ స్టేషన్కు రప్పించుకుని తీవ్రస్థాయిలో మనోవేదనకు గురి చేస్తున్నారని మనస్థాపానికి గురై తన భార్య శివమ్మ విశ్వ ద్రావణం తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తమకు తన బావమరిది ఐదు లక్షల రూపాయలు డబ్బులు బాకీ ఉన్నారని ఆ డబ్బులు విషయమై అడగగా తిరిగి నా సంతకం ఫోర్జరీ చేసి కోర్టులో నేను 10 లక్షలు బాకీ ఉన్నట్టుగా కేసు వేశారని ఆవేదన వ్యక్తం చేశాడు లక్ష్మిరెడ్డి. తనకు తన భార్యకు న్యాయం చేయాలని మీడియా ఎదుట వాపోయాడు. పెండ్లిమర్రి ఎస్సై రాజరాజేశ్వర్ రెడ్డి తమతో బలవంతంగా తెల్ల కాగితంపై సంతకాలు చేయించుకున్నారని బాధితుడు లక్ష్మిరెడ్డి తెలిపాడు. ఆత్మహత్యాయత్నం చేసిన శివమ్మ పులివెందులలో ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
Andole Mla Kranthi kiran: సింగూరు ప్రాజెక్టుని సందర్శించిన ఎమ్మెల్యే క్రాంతికిరణ్