మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇవాళ హైకోర్టులో కీలక పరిణామాలు జరిగాయి.. వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో నిందితులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుల బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది హైకోర్టు.. వివేకా హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నా దేవిరెడ్డి శివశంకర రెడ్డి, గజ్జల ఉమా మహేశ్వరరెడ్డి, సునీల్ యాదవ్ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.. అయితే, ఇరు పక్షాల వాదనలు విన్న…
* నేటి నుంచి తెలుగు సినిమా షూటింగ్స్ బంద్.. * నేడు అమరావతిలో నాల్గో రోజు బీజేపీ పాదయాత్ర, వెలగపూడి నుంచి ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం, రాయపూడి, అబ్బూరిపాలెం, బోరుపాలెంలో కొనసాగనున్న బీజేపీ పాదయాత్ర * హైదరాబాద్: నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ ముందుకు చికోటి ప్రవీణ్.. హవాలా లావాదేవీలపై ప్రశ్నించనున్న అధికారులు * నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన, గజ్వెల్ లో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి హరీష్ రావు, దౌల్తాబాద్(మం) దొమ్మట…
Loan App Audio Call Leak: అధిక వడ్డీల కోసం లోన్ యాప్ నిర్వాహకులు సామాన్యులను వేధిస్తున్నారు. దీంతో లోన్ యాప్‌లకు పలువురు ప్రాణాలు తీసుకుంటున్నారు. లోన్ కట్టడం లేటు అయితే అశ్లీల ఫోటోలతో బాధితుల ఫోటోలు మార్ఫింగ్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారు. ఏపీ, తెలంగాణలో లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలు క్రమంగా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి.
Ambati Rambabu: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. అసెంబ్లీకి రాకుండా పారిపోయిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడి కత్తి కమల్‌హాసన్ అంటూ సీఎం జగన్‌ను ఉద్దేశించి మాట్లాడుతున్న చంద్రబాబుకు.. భారతీయుడులో కమల్‌హాసన్ గురించి తెలియదా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. దుర్మార్గులకు, దుష్టులను, చంద్రబాబు లాంటి 420 గాళ్లను రాజకీయంగా గొంతు కోయడానికి…
Chandrababu Naidu: ఇటీవల గోదావరి వరదలకు పలు లంక గ్రామాల బాధితుల్లో కొందరు ఇంకా నిస్సహాయస్థితిలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు దాతలకు పిలుపునిచ్చారు. వరద బాధితులకు కూరగాయలు, బియ్యం వితరణ చేయాలని దాతలను కోరారు. ఇటీవల కురిసిన వర్షాలు ప్రజలకు అపార నష్టాన్ని మిగిల్చాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాల తరబడి సమకూర్చుకున్న సంపదంతా వరదపాలై కట్టుబట్టలతో ప్రజలు నిస్సహాయ స్థితిలో ఉన్నారని అభిప్రాయపడ్డారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని..…