విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో అదృశ్యమైన, ప్రియుడిని పెళ్లాడి ప్రత్యక్షమైన సాయిప్రియ కేసు రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది… భర్త కన్నుగప్పి ప్రియుడితో వెళ్లిపోయింది సాయిప్రియ.. కానీ, ఆ విషయం తెలియన ఆమె భర్త శ్రీనివాస్.. తన భార్య సముద్రంలో గల్లంతయ్యిందని భావించిన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. దీంతో, పోలీసులు, నేవీ, సముద్రతీరంలో గస్తీ దళం కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది.. కానీ, పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి.. ప్రియుడితో వెళ్లిపోయిన ఆమె.. అతడిని పెళ్లి చేసుకుంది.. ఇక, తన కోసం వెతకవద్దు అంటూ.. మమ్మల్ని వదిలేయండి అంటూ తన పేరెంట్స్‌కు మెసేజ్ పెట్టి ట్విస్ట్ ఇచ్చింది.. ఇక, అంతేకాదు.. ఆ తర్వాత తన ప్రియుడితో కలిసి విశాఖపట్నం పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యక్షమైన ఆమె.. తమకు రక్షణ కల్పించాలంటూ మరో ట్విస్ట్.. ఇలా ఎన్నో మలుపు తిరుగుతూ వచ్చిన ఈ కేసులో మొన్నటి మొన్నే సాయిప్రియ, ఆమె ప్రియుడు రవితేజపై కేసు నమోదు చేశారు పోలీసులు.. ఈ కేసులో మరో బిగ్ ట్విస్ట్ వచ్చేచేరింది.. ఇప్పుడు ఆమె తండ్రిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
Read Also:
Gautam Adani: ప్రపంచ కుబేరుల జాబితా.. మూడో స్థానానికి ఎగబాకిన అదానీ.. టాప్ 10లో లేని అంబానీ
సాయి ప్రియ తండ్రి రామిరెడ్డి అప్పలరాజుపై కేసు నమోదు చేశారు వైజాగ్ పోలీసులు.. సాయి ప్రియ ప్రేమ వ్యవహారం తెలిసినా.. ఏమీ చెప్పకుండా దాచి ఉంచి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారంటూ అప్పలరాజుపై కేసు బుక్ చేశారు.. ఉద్దేశ్య పూర్వకంగానే జిల్లా యంత్రాన్ని, పోలీసులను, కోస్ట్ గార్డ్ ను తప్పుదోవ పట్టించడంపై కేసు నమోదు చేశారు.. కాగా, సాయిప్రియ, రవితేజపై ప్రభుత్వ ధనం, సమయం వృథా చేసినందుకు కోర్టు అనుమతితో పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.. మరోవైపు, తనకు భర్త ఉండగానే అతడ్ని మోసగించి వేరొకరిని పెళ్లి చేసుకుని ఆయన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందున ఆమెపై చర్యలకు దిగాలనుకున్నారు త్రీటౌన్ పోలీసులు.. అయితే, దీనిపై కోర్టును ఆశ్రయించారు.. ఇక, కోర్టు కూడా అనుమతించడంతో సాయిప్రియ, రవితేజపై తాజాగా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.. ఇలా వరుసగా సాయిప్రియ కేసులో కేసుల పరంపర కొనసాగుతోంది. సాయిప్రియ తండ్రి రాపిరెడ్డి అప్పలరాజుపై కోర్టు అనుమతితో సీఆర్ నంబర్ 424/2022 యూ/ఎస్ 182 ఐపీసీ కేసు రిజిస్టర్ చేసినట్టు త్రీటౌన్ పోలీసులు తెలిపారు.