సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1న చలో విజయవాడకు పిలుపునిచ్చాయి ఉద్యోగ సంఘాలు.. అయితే, ఈ కార్యక్రమాన్ని అనుమతి లేదని స్పష్టం చేశారు పోలీసులు.. గతంలో విజయవాడలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈ సారి ప్రభుత్వం పటిష్ట చర్యలకు సిద్ధం అవుతోంది.. ఇక, నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో సమావేశం అయ్యారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.. రాష్ట్రంలో శాంతి భద్రతలపై డీజీపీతో సీఎం సమీక్ష నిర్వహించారు.. సెప్టెంబర్ 1వ తేదీన ఛలో విజయవాడకు ఉద్యోగులు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇవాళ్టి సమావేశానికి ప్రధాన్యత ఏర్పడింది..
Read Also: Ghulam Nabi Azad: నేను మోడీ ఏజెంట్‌ని కాదు.. ఆయనను కౌగిలించుకున్నది నేనా?
అయితే, ఇప్పటి వరకు చలో విజయవాడ, సీఎం ఇంటి ముట్టడికి పోలీసులు అనుమతివ్వలేదు.. ఇక, గత అనుభవాల దృష్ట్యా.. ఉద్యోగులు విజయవాడ రాకుండా తీసుకుంటోన్న చర్యలను సీఎం జగన్‌కు వివరించిన డీజీపీ… అంతేకాదు, చలో విజయవాడ, సీఎం ఇంటి ముట్టడిని అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై డీజీపీకి సీఎం దిశానిర్దేశం చేశారు.. మరోవైపు, వినాయక చవితికి మండపాలకు అనుమతులు, భద్రతపై కూడా ఈ సమావేశంలో చర్చించారు.. వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, సీపీఎస్ రద్దుపై ఉద్యోగులు ఆందోళన ఉద్ధృతం చేశాయి.. దీనిలో భాగంగా ఉద్యోగులు చలో విజయవాడ, సీఎం నివాసం ముట్టడి కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణించారు.. ఈ కార్యక్రమాలలో ఉద్యోగులు పాల్గొనకుండా పోలీసు యంత్రాంగం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఆందోళన కార్యక్రమాలకు హాజరు కావొద్దంటూ ఇప్పటికే సీపీఎస్ ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులకు వ్యక్తిగతంగా నోటీసులు కూడా జారీ చేసిన విషయం విదితమే.