ముఖ్యమంత్రి ఇల్లు, ఆఫీసు ఒక చట్టబద్ధ వ్యవస్థ.. అటువంటి వ్యవస్థల పై దాడి చేయటానికి పిలుపు ఇవ్వటం చట్ట వ్యతిరేకం.. వాటికి కచ్చితంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.. ఉద్యోగుల ఆందోళన, పిలుపులపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. చట్టబద్ధ వ్యవస్థ పై దాడి జరగకుండా నివారించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం.. ఈ పిలుపునకు బాధ్యులైన వ్యక్తులను రాత్రి జిల్లాల్లో అదుపులోకి తీసుకున్నాం.. వారందరికీ 41 నోటీసులు ఇచ్చి పంపించేశాం అన్నారు.. ఆ నోటీసులు భవిష్యత్తులోనూ పోలీసులకు ఒక రిఫరెన్స్‌గా ఉంటుంది.. ఎవరైనా వ్యవస్థల పై దాడి చేస్తాం అంటే ఊరుకోబోం అని వార్నింగ్ ఇచ్చారు.
Read Also: NCRB: దేశంలో మహిళలకు రక్షణ లేని నగరాలు ఇవే.. ప్రతీరోజూ ఇద్దరు బాలికలపై అత్యాచారాలు..?
ఇక, ఆందోళన కార్యక్రమాలను విత్ డ్రా చేసుకున్నామని ప్రకటించటం ఆహ్వానించదగిన అంశం అన్నారు డీజీపీ.. ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిక్టేట్ చేయలేరని స్పష్టం చేశారు. మరోవైపు.. వినాయక నిమజ్జన కార్యక్రమాలు ఎప్పుడూ జరిగే విధంగానే జరుగుతాయి.. అనవసరంగా రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదన్నారు.. గణేష్ ఉత్సవ కమిటీ వాళ్లకు గతంలో ఉన్న నిబంధనలే చెప్పాం.. ఫైర్ సేఫ్టీ, విద్యుత్ శాఖ, పోలీసు శాఖ అనుమతులు ఎప్పుడూ తీసుకునేదే అన్నారు. ప్రతి రోజు ఉదయం సెల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాం.. రాజకీయ పార్టీలు వాస్తవాలు లేకుండా ఏదో ఒకటి ఆరోపించటం కరెక్ట్ కాదు అని హితవు పలికారు.. నిమజ్జనం ప్రశాంతంగా జరగాలనే మేమూ కోరుకుంటాం.. ఎవరికైనా అనుమానాలు ఉంటే మా దగ్గరకు రండి నివృత్తి చేస్తాం.. అంతే కానీ ప్రకటనలతో ప్రజల్లో ఆందోళనలు పెరిగేటట్లు చేయకండి అని సూచించారు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి..