టీడీపీ నేతలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఎంపీ విజయ సాయిరెడ్డి, గుర్రంపాటి దేవేంధర్ రెడ్డిలపై సీఐడీ ఏడీజీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు.
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విచారణ జరిపిస్తుంది.. వీడియో వాస్తవమని తేలితే …ఇలాంటి ఘటనలు పునారవృతం కాకుండా పార్టీ కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి..
శ్రీశైలం ప్రాజెక్టులో 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.. జల విద్యుత్ ఉత్పత్తి, రెండు గేట్ల ద్వారా 1,19,763 క్యూసెక్కుల నీరు డ్యామ్ నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.
* కామన్వెల్త్ గేమ్స్‌లో దూసుకెళ్తోన్న భారత్… ఇప్పటి వరకు భారత్ ఖాతాలో 20 పతకాలు.. అందులో 6 స్వర్ణాలు, 7 రజతాలు, 7 కాంస్య పతకాలు * నేడు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ పిలుపు.. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించనున్న కాంగ్రెస్ * ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ రోజు నుంచి ఈ నెల 15వ తేదీ వరకు 10 రోజుల పాటు.. తెలంగాణలోని గోల్కొండ,…
‘జగనన్న తోడు’ పథకం కింద వడ్డీ లేని రుణాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమచేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. 3.95 లక్షల మందికి ఈ పథకం ద్వారా కొత్తగా రూ.395 కోట్ల వడ్డీ లేని రుణాలను సమకూర్చడంతోపాటు గత ఆర్నెల్లకు సంబంధించి రూ.15.96 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను కూడా జమ చేశారు.. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. చిరు వ్యాపారులకు, హస్త కళాకారులకు రూ. 10వేల చొప్పున వడ్డీలేని రుణాల పథకం అమలు చేస్తున్నామని…