గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది.. ఇప్పటికే భద్రచలం దగ్గర 51 అడుగులకు పైగా గోదావరి ప్రవాహం కొనసాగుతుండగా.. మరోవైపు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు.. ధవళేశ్వరం దగ్గర గోదావరి నీటిమట్టం 13.75 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యింది.. ఇక, కోనసీమ లంక గ్రామాలను అప్రమత్తం చేసింది అధికార యంత్రాంగం.. అయితే, అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్లో మళ్లీ వరద కష్టాలు మొదలయ్యాయి.. Read Also:…
ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోనూ అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం.. అధికారంలోకి వస్తాం అంటూ.. ప్రకటిస్తూ ఉంటారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్.. ఇక, అందరూ కలిసి రావాలి.. మా పార్టీలో చేరాలని అందరినీ ఆహ్వానిస్తూ ఉంటారు.. అంతే కాదు.. కాబోయే సీఎం నేనే..! కేంద్రంలో మంచి పోస్ట్ ఇస్తామన్నారు..! లాంటి స్టేట్మెంట్లూ కూడా చూస్తుంటాం.. అయితే, కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న తాజా నిర్ణయంతో ఆయనకు గట్టి షాక్ తగిలింది… దేశవ్యాప్తంగా క్రియాశీలంగా లేని 537…
టెక్నాలజీతో పాటు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి.. ఎక్కడ ఏం చేస్తే.. ఎవరి ఉచ్చులో చిక్కుకుంటామో తెలియని పరిస్థితి దాపురించింది.. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా డిజిటల్ పేమెంట్స్ జరగుతున్నాయి.. అవే, కొందరి కొంప ముంచుతున్నాయి… తాజాగా, ఓ వ్యక్తి 35 వేల రూపాయలు పెట్టి ఏసీ కొనుగోలు చేయడమే ఆయన చేసిన పాపం అయ్యింది.. ఆ తర్వాత సదరు బాధితుడి ఖాతా నుంచి దఫదఫాలుగా 27 లక్షల రూపాయాలు మాయం అయ్యాయి… సైబర్ నేరగాళ్లు చేతివాటం చూపించిన ఘటనకు…
ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడ రాజకీయ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.. తాజాగా, తిరుపతిలో స్థానిక జనసేన పార్టీ నేత ఇంటిపై దాడి చేశారు దుండగులు… తమ డివిజన్లో మౌలిక వసతులు సరిగ్గా లేవంటూ అడిగినందుకు ఇంటిలోకి దూరి అధికార పార్టీకి చెందిన నేత అనుచరులు దాడి చేశారని ఆరోపిస్తున్నారు జనసేన పార్టీ నేతలు.. తిరుపతిలోని వెంకటరెడ్డి కాలనీలో ఈ ఘటన జరిగింది.. ఒక్కసారిగా ఇంటిలోకి దూరి ఇంట్లోని ఫర్నిచర్, సామాన్లు ధ్వంసం చేసినట్టుగా చెబుతున్నారు.. ఊహించని ఘటనతో జనసేన నేత,…
* హైదరాబాద్: 111 జీవోపై నేడు హైకోర్టులో విచారణ.. అఫిడవిట్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. కొత్త జీవో 69 అమలయ్యే వరకు పాత నిబంధనలు యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం అఫిడవిట్ * కాకినాడ: నేడు తొండంగి, రావి కంపాడు గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి దాడిశెట్టి రాజా * కాకినాడ: రైల్వే ట్రాక్ మరమ్మత్తులు కారణంగా మాధవపట్నం రైల్వే గేటు మూసివేత.. కాకినాడ, సామర్లకోట వెళ్లే వాహనాలు అచ్చంపేట జంక్షన్ మీదగా మళ్లింపు…
Amaravati Assigned Lands Case: ఏపీ రాజధాని అసైన్డ్ ల్యాండ్ స్కామ్ కేసులో ఐదుగురిని సీఐడీ ఈరోజు మధ్యాహ్నం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నిందితుందరినీ సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపరిచారు. అయితే వీరిలో ఇద్దరు నిందితులు కొల్లి శివరాం , గట్టెం వెంకటేష్‌ను రిమాండ్‌కు పంపేందుకు ఏసీబీ కోర్టు జడ్జి తిరస్కరించారు. ఎఫ్ఐఆర్లో సీఐడీ నమోదు చేసిన రెండు సెక్షన్లు కేసుకు వర్తించవని.. 41 ఏ నోటీసులు ఇచ్చి పంపాలని జడ్జి ఆదేశించారు.…
Srikanth Reddy: మూడు రాజధానుల అంశంలో టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరిని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తప్పుబట్టారు. అమరావతి రైతుల పాదయాత్రను తాను తప్పుపట్టడం లేదని.. పాదయాత్రలో మాట్లాడిన వాళ్ల మాటలు రాయలసీమ వాసిగా తనకు బాధ కలిగించాయని తెలిపారు. మూడు రాజధానులు చేస్తే రాయలసీమకు చుక్క నీరు ఇవ్వమని అంటున్నారని.. మూడు రాజధానులు అమలు చేస్తే మధ్య ఆంధ్ర ప్రదేశ్ కోసం ఉద్యమం చేస్తామంటున్నారని.. ఈ వ్యాఖ్యల వెనుక చంద్రబాబు ఉన్నారని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు.…
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మరోసారి నంబర్‌వన్‌గా నిలిచింది. ఈ ఏడాది తొలి 7 నెలల్లో పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ దేశంలోనే తొలి స్థానంలో నిలిచినట్లు కేంద్ర ప్రభుత్వ సంస్థ డిపార్టుమెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) ప్రకటించింది. తొలి ఏడు నెలల్లో రూ.40,361 కోట్ల పెట్టుబడులను ఏపీ రాబట్టినట్లు డీపీఐఐటీ తన నివేదికలో వెల్లడించింది. పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ, ఒడిశా తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఈ రెండు రాష్ట్రాలు…
AP Bifurcation Bill: ఈనెల 27న ఉదయం 11 గంటలకు కేంద్ర హోంశాఖ కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో ఏపీ విభజన చట్టం అమలుపై చర్చించనుంది. ఈ సమావేశం ఏజెండాలో మొత్తం 14 అంశాలు ఉన్నాయి. ఏడు అంశాలు రెండు రాష్ట్రాలకు సంబంధించినవి కాగా మరో ఏడు ఏపీకి సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఈ మేరకు ఈనెల 27న కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వ…
Andhra Pradesh: ఏపీ రాజధాని అసైన్డ్ భూముల కుంభకోణం కేసుపై సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు ఐదుగురిని అరెస్ట్ చేశారు. కొల్లి శివరాం, గట్టెం వెంకటేష్, చిక్కాల విజయసారథి, బడే ఆంజనేయలు, కొట్టి దొరబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. 1100 ఎకరాల అసైన్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని సీఐడీ అభియోగం మోపింది. ఇందులో 169.27 ఎకరాలకు సంబంధించి విచారణ చేపట్టగా ఐదుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. కేసులో ప్రధాన…