* నేడు ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు… దేశ, విదేశాల నుంచి మోడీకి శుభాకాంక్షల వెల్లువ * హైదరాబాద్: నేడు ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు.. జాతీయ జెండా ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్.. * ఉదయం 7 గంటలకు బీజేపీ ఆఫీసులో బండి సంజయ్ జెండా ఆవిష్కరణ.. * ఉదయం 8.40కి పరేడ్ గ్రౌండ్లో విమోచన వేడుకల్లో పాల్గొననున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా * ఉదయం 9 గంటలకు టీఆర్ఎస్ ఆఫీసులో కేశవరావు…
సచివాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలపై అధికారులతో డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సమీక్షించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు వెలంపల్లి, మల్లాది విష్ణు, కలెక్టర్ దిల్లీ రావు, దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్లాల్, పోలీస్ కమిషనర్ కాంతి రానా టాటా హాజరయ్యారు. ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను అధికారుల నుంచి మంత్రి కొట్టు సత్యనారాయణ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా…
Andhra Pradesh: ఏపీలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల విధుల్లో వినియోగించరాదంటూ ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో సమావేశం సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా ఈ ఆదేశాలు జారీ చేశారు.…
Kothapalli Geetha: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు హైకోర్టు ఊరట లభించింది. బ్యాంకును మోసం చేశారన్న కేసులో కొత్తపల్లి గీతతో పాటు ఆమె భర్తకు రెండు రోజుల కిందట నాంపల్లి సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష విధించగా.. సీబీఐ కోర్టు తీర్పును కొత్తపల్లి గీత దంపతులు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ సందర్భంగా విచారణ చేపట్టిన హైకోర్టు సీబీఐ కోర్టు తీర్పు అమలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా కొత్తపల్లి గీత, ఆమె…
Gudivada Amarnath: ఏపీ రాజధానిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అకడమిక్ సంవత్సరం నుంచే విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. త్వరలో అసెంబ్లీలో ఈ అంశంపై బిల్లు కూడా పెడతామని మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. తమకు సవాళ్లు విసరడం దేనికి అని.. టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తానని చంద్రబాబు చెప్పగానే…
CM Jagan: ఏపీ ఆర్ధిక వ్యవస్థపై అసెంబ్లీలో సీఎం జగన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగిస్తూ.. కరోనా లాంటి ప్రత్యేక పరిస్థితులు ఉన్నా ఏపీ గణనీయంగా వృద్ధి సాధించిందని వెల్లడించారు. అప్పులు చేస్తున్న ప్రభుత్వం ఎలా చెల్లిస్తుందని దుష్ప్రచారం కూడా చేస్తున్నారని.. రుణాలకు వడ్డీల కింద రూ. 21,499 కోట్లు, రుణంగా రూ. 14,558 కోట్లు చెల్లించామని సీఎం జగన్ వివరించారు. అలాగే రాష్ట్ర రెవెన్యూ 2021-22 ఆర్ధిక సంవత్సరానికి…
అమరావతి రైతుల పాదయాత్రపై సంచలన కామెంట్లు చేశారు మంత్రి సిదిరి అప్పలరాజు… అమరావతి ప్రాంత భూముల స్కాం ఆరోపణల్లో కొత్త వాదన తెర మీదకు తీసుకుని వచ్చిన ఆయన.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. రైతుల ముసుగులో చేస్తున్న పాదయాత్ర కచ్చితంగా అడ్డుకుని తీరుతాం అన్నారు.. ఈ విషయంలో చర్చే అవసరం లేదన్న ఆయన.. శ్రీకాకుళం పోరాటాల గడ్డ.. మా ప్రాంతానికి వచ్చి మా గుండెలపై కొడతాం అంటే ఊరుకుంటామా? అంటూ ఫైర్ అయ్యారు… ఇక, డిసెంబర్లో రాజధాని…
సీపీఎస్ రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మాట వాస్తవమే అని మరోసారి స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.. శాసనమండలిలో సీపీఎస్ రద్దు పై వాయిదా తీర్మానం ఇచ్చారు పీడీఎఫ్ సభ్యులు.. ఆ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు మండలి చైర్మన్ రాజు.. అయితే, ఉపాధ్యాయులపై నమోదు చేసిన కేసులుపై పీడీఎఫ్ సభ్యులు పట్టుబట్టారు.. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడిస్తామని చెప్పటం ధర్మమేనా…? అని ప్రశ్నించారు.. సీపీఎస్ ను రద్దు…