YSRCP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజుకు సెక్యూరిటీని పెంచుతూ ఏపీ ప్రభుత్వం భద్రతా పరమైన చర్యలు తీసుకుంది. ఈ మేరకు అదనంగా నలుగురు పోలీసులను ప్రభుత్వం నియమించింది. ఇటీవల మంత్రి సీదిరి అప్పలరాజును హెచ్చరిస్తూ మావోయిస్టుల లేఖ విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాల సిఫార్సు మేరకు నలుగురు పోలీసులను కేటాయిస్తు రాష్ట్ర పోలీసు శాఖ భద్రతా పరమైన చర్యలు తీసుకుంది.
Read Also: Missing Case: కడపలో ఏడో తరగతి విద్యార్థిని మిస్సింగ్.. మూడు రోజులు దాటినా దొరకని ఆచూకీ
ఇప్పటికే మంత్రి సీదిరి అప్పలరాజు భద్రత కోసం నలుగురు గన్ మెన్‌లు, నలుగురు సివిల్ పోలీసులు విధులు నిర్వహిస్తుండగా అదనంగా మరో నలుగురు సివిల్ పోలీసులను నియమించి రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తూ సెక్యూరిటీ ప్రమాణాల పెంపునకు నిర్ణయం తీసుకుంది. కాగా మావోయిస్టుల బెదిరింపు నేపథ్యంలో మంత్రి సీదిరి అప్పలరాజు భద్రతకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుందని మంత్రి క్యాంపు కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.