Kodali Nani: మంత్రివర్గంలో కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత లేదంటూ వైసీపీ నేత వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి కొడాలి నాని ఖండించారు. ప్రాధాన్యత ప్రకారమే ఏ వర్గానికైనా పదవులు వస్తాయని చెప్పారు. కమ్మ సంఘం సమావేశాల్లో సీనియర్ నేత వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యలు సరికాదని హితవు పలికారు. గత టీడీపీ హయాంలో మైనార్టీ , ఎస్టీలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని కొడాలి నాని గుర్తుచేశారు. ఒక్క కమ్మ సామాజిక వర్గానికే…
Andhra Pradesh: ఏపీలోని ప్రభుత్వం ఉద్యోగులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ సచివాలయం, అసెంబ్లీలోని ఉద్యోగులు అంతా కలిసి ఏపీ సచివాలయ సీపీఎస్ అసోసియేషన్‌గా ఉద్యోగులు ఏర్పడ్డారు. ఈ సందర్భంగా ఏపీ సెక్రటేరియట్ సీపీఎస్ అసోసియేషన్ మాట్లాడుతూ… పాత పెన్షన్ విధానం పునరుద్ధరిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అమలు చేయలేదని ఆరోపించింది. కనీసం సీపీఎస్ విధానాన్ని కూడా ప్రభుత్వం సరిగ్గా అమలు చేయడం లేదని తెలిపింది. ప్రభుత్వ తీరుతో సీపీఎస్ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి, అసహనంతో ఉన్నారని…
APSRTC: ఏపీఎస్ఆర్టీసీ కొత్తగా ప్రవేశపెట్టిన నాన్ ఏసీ స్లీపర్ బస్సులు ఆకట్టుకుంటున్నాయి. ‘స్టార్ లైనర్’ పేరుతో వీటిని అందుబాటులోకి తెచ్చారు. 2+1 స్లీపర్ కోచ్ తరహాలో ఉండే ఈ బస్సులో 30 బెర్తులు ఉంటాయి. ఏసీ పడని వారికి ఈ బస్సు చక్కగా ఉపయోగపడుతుంది. ఈ బస్సులో చాలా సౌకర్యాలు ఉన్నాయి. ఇవి ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడనున్నాయి. రీడింగ్ ల్యాంప్స్, సీసీటీవీ, ఆడియో, ఛార్జింగ్ పోర్ట్స్, ఫైర్ సేఫ్టీ అలారమ్, ప్రతి బెర్త్‌కు లగేజ్ ర్యాక్ లాంటి…
Nellore District: ఈ లోకంలో కన్నబిడ్డలపై ప్రేమ లేని తల్లిదండ్రులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. కానీ కొందరు తమ ప్రేమను బయటకు చాటుకుంటారు.. కొందరు అయితే తమ ప్రేమను మనసులోనే దాచిపెట్టుకుంటారు. అయితే ఓ తండ్రి మాత్రం తన ప్రేమను ఎవరికీ సాధ్యం కాని రీతిలో చాటుకున్నాడు. నెల్లూరు జిల్లాలోని కాకుటూరు గ్రామంలో ఓ తండ్రి తన కుమార్తె జ్ఞాపకంగా ఆలయం కట్టించాడు. నిత్యం అందులో పూజలు చేస్తూ కనిపిస్తున్నాడు. కాకుటూరు గ్రామానికి చెందిన చెంచయ్య,…
Nadendla Manohar: విశాఖ పర్యటనలో సీఎం జగన్‌పై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మరోసారి విమర్శలు చేశారు. ప్రజలు వైసీపీపై తిరగబడటానికి సిద్ధంగా ఉన్నారన్నారు. జనసేనకు కాండక్ట్ సర్టిఫికెట్ ముఖ్యమంత్రి దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. అన్యాయాలను ప్రశ్నిస్తున్నందుకు తమ పార్టీని రౌడీసేన అంటున్నారని.. ముఖ్యమంత్రి స్థాయి తగ్గించుకుని వ్యాఖ్యలు చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. సీఎం జగన్‌లో రెండు ముఖాలు ఉన్నాయని.. బయటకు కనిపించేది ఒక్కటైతే.. తెరవెనుక మరొకటి ఉందని ఆరోపించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని…
Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ వరుస పర్యటనలను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 23న శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష (రీ సర్వే) రెండో విడత కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈనెల 23న ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఉదయం 11 గంటలకు నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి సీఎం జగన్ చేరుకుంటారు. ఉదయం 11…
Kodali Nani: గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తనను ఓడించేందుకు టీడీపీ నేతలు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గుడివాడలో చంద్రబాబు పోటీ చేసినా, ఆయన పుత్రరత్నం లోకేష్ పోటీ చేసినా వైసీసీ అభ్యర్థిగానే తానే ఉంటానని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు అండ్ కో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా, కుల సంఘాలు వచ్చిన అరిచి గోల చేసినా తన గెలుపును…
Thopudurthi Prakash Reddy: అనంతపురం జిల్లా రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మరోసారి టీడీపీపై విమర్శలు చేశారు. టీడీపీ హయాంలో జిల్లాకు జాకీ పరిశ్రమ వచ్చిందా అని మీడియా సాక్షిగా ఆయన ప్రశ్నించారు. జాకీ పరిశ్రమ అనేది ఒక లూటీ పరిశ్రమ అని.. ఇతర రాష్ట్రాల్లో యూనిట్లను ఎత్తివేసిందని ఆరోపించారు. ఆరోజు చంద్రబాబు, లోకేష్ ఆదేశాల మేరకు అప్పటి మంత్రి పరిటాల సునీత పాటించారని.. అందరూ కలిసి రూ.300 కోట్ల స్కామ్ చేసేందుకు ప్రయత్నించారని తోపుదుర్తి…
Nadendla Manohar: ఏపీ సీఎం జగన్‌పై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన పార్టీని రౌడీసేననగా సంభోదిస్తూ జగన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. జనసేన ఎందుకు రౌడీసేన సీఎం జగన్ గారూ అంటూ ఆయన పలు ప్రశ్నలు సంధించారు. సీఎం జగన్ సొంత జిల్లాలో వరద బాధితులను గాలికొదిలేసిన వాస్తవాన్ని ప్రపంచానికి చూపినందుకా అని నిలదీశారు. ఆడబిడ్డలకు రక్షణ లేదని గొంతెత్తినందుకా అని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం రోడ్డున…
Church Pastor: ప్రపంచం టెక్నాలజీతో దూసుకుపోతోంది. కానీ, ఇంకా మూఢనమ్మకాలను మాత్రం ప్రజలు వదలడం లేదు. భక్తి ఉండడం తప్పు కాదు.. కానీ, ఆ భక్తి పేరుతో ప్రజలను మోసం చేయడం, తమ మతంలోకి రావాలని ప్రేరిపించడం తప్పు.