Andhra Pradesh: మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం వేగం పెంచింది. ఈ మేరకు పోర్టు నిర్మాణానికి రూ.3,940 కోట్ల రుణం మంజూరైంది. దీంతో పోర్టు వ్యయానికి అవసరం అయ్యే 100 శాతం రుణాన్ని పవన్ ఫైనాన్స్ కార్పొరేషన్ మంజూరు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి పవన్ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణం మంజూరు ఉత్తర్వులు పంపిందని తెలిపారు. రుణం మంజూరు కావడంతో అతి త్వరలోనే మచిలీపట్నం పోర్టుకు సీఎం జగన్ శంకుస్థాపన…
Krishna District: కృష్ణా జిల్లా మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారి పక్కన గూడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ఏర్పాటు చేసిన సీఎం జగన్ కటౌట్‌కు గర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. బందరు డీఎస్పీ భాషా, పెడన రూరల్ సీఐ వీరయ్య ప్రసన్నగౌడ్, గూడూరు ఎస్సై వెంకట్…
Andhra Pradesh: చరిత్రలో తీపి జ్ఞాపకాలతో పాటు చేదు గుళికలు కూడా ఉంటాయి. అలాంటిదే ఆంధ్రప్రదేశ్‌లోని దివిసీమ ఉప్పెన విషాదం. యావత్ భారత్ దేశాన్ని కదిలించిన దివి సీమ ఉప్పెన విషాదానికి నేటితో 45 ఏళ్లు పూర్తవుతున్నాయి. 1977 నవంబర్ 19న కృష్ణా జిల్లా సమీపంలోని సముద్రంలో తుపానుతో వేల మంది ప్రాణాలు కడలిలో కలిసిపోయాయి. ఈ ప్రకృతి విలయానికి అధికారికంగానే 14వేలకు పైగా ప్రజలు మరణించారు. అనధికారికంగా సుమారు 50 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.…
What’s Today: • తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. ఈరోజు, రేపు చలి పెరిగే అవకాశం.. తెలంగాణలోని వికారాబాద్‌లో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు • హైదరాబాద్: నేడు, రేపు ఫార్ములా ఈ రేసింగ్ లీగ్ ట్రయల్ రన్.. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రయల్ రన్ • తూర్పుగోదావరి జిల్లా్: నేడు, రేపు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటు నమోదుకు ప్రత్యేక శిబిరాలు • విజయవాడ:…
కర్నూలు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టారు వైసీపీ కార్యకర్తలు.. కర్నూలు ద్రోహి అంటూ నినాదాలు చేశారు.. మూడు రాజధానులు కావాలని డిమాండ్ చేస్తూ.. టీడీపీ కార్యాలయం వద్ద నినాదాలు చేశారు.. చంద్రబాబు గో బ్యాక్ అంటూ వైసీపీ శ్రేణులు ఓవైపు.. సీఎం డౌన్ డౌన్ అంటూ టీడీపీ శ్రేణులు మరోవైపు నినాదాలు, తోపులాటలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. అయితే, వారిపై అదేస్థాయిలో విరిచుకుపడ్డారు…
పదే పదే ఎందుకు మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు అంటూ ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు వ్యాపారస్తులు… ఇవాళ మంత్రి బుగ్గన సమక్షంలో ట్రేడ్ అడ్వైయిజరీ కమిటీ సమావేశం జరిగింది… అయితే, ఈ సమావేశంలో ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు పలువురు వ్యాపారస్తులు.. అధికారులు వ్యాపారులతో పారదర్శకంగా వ్యవహరించడం లేదని ఫిర్యాదు చేశారు… పదే పదే ఎందుకు ఇబ్బందులకు గురిచేస్తున్నారో అర్థం కావడంలేదంటూ ఆవేదన వెలిబుచ్చారు.. ప్రభుత్వం వద్ద నిధుల్లేవని కొందరు…
కర్నూలు జిల్లా పర్యటనలో ఇక నాకు ఇవే చివరి ఎన్నికలు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్లు ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచాయి.. చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.. ఇక, చంద్రబాబు కామెంట్లపై స్పందించిన ఉషశ్రీ చరణ్.. వంచనకు మరోపేరు చంద్రబాబు నాయుడు అంటూ ఫైర్ అయ్యారు.. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఎన్నికలకు ముందే చేతులెత్తేశారని.. అందుకే ఇవే చివరి ఎన్నికలు…
CM YS Jagan Mohan Reddy: సంక్షేమ హాస్టళ్లలో ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా మారాలని ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి… మహిళా, శిశు సంక్షేమశాఖ, సంక్షేమ హాస్టళ్లపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు సీఎం.. ఈ సమావేశంలో గతంలో ఇచ్చిన సీఎం ఆదేశాల అమలు ప్రగతిని ఆయనకు వివరించారు అధికారులు. అంగన్వాడీలలో సూపర్ వైజర్ల పోస్టులను భర్తీచేశామని తెలియజేశారు.. అంగన్వాడీలలో పాల సరఫరాపై నిరంతర పర్యవేక్షణ, వాటి ఫలితాలను వివరించారు.. అక్టోబర్ నెలలో…
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. అన్ని పార్టీలు దూకుడు చూపిస్తున్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ కూడా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వరుస పర్యటనలు చేపడుతున్నారు.. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించింది జనసేన పార్టీ.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శిస్తూ.. ఆర్థిక సాయం చేస్తూ వచ్చారు పవన్.. ఆ తర్వాత ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి జనవాహిణి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. ఇప్పుడు జగనన్న ఇళ్లపై సోషల్…