Andhra Pradesh: ఏపీలో మాండూస్ తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా పలు జిల్లాలలో అధికారులు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు అన్నమయ్య జిల్లాలో మాండూస్ తుఫాన్ కారణంగా ఈరోజు, రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ గిరీషా సూచించారు. జిల్లాలో సైక్లోన్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని.. ఎక్కడైనా సమస్యలు ఎదురైతే సమస్యలపై కంట్రోల్ రూం నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు. అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్: 08561 -293006, రాయచోటి డివిజన్ కంట్రోల్ రూమ్: 9701101166 లేదా 9440407003, రాజంపేట డివిజన్ కంట్రోల్ రూమ్: 8712349929, మదనపల్లి డివిజన్ కంట్రోల్ రూమ్: 9849904116
మరోవైపు మాండూస్ తుఫాన్ పట్ల కడప జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయరామరాజు సూచించారు. జిల్లా కలెక్టరేట్‌తో పాటు నాలుగు రెవెన్యూ డివిజన్ల పరిధిలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామని తెలిపారు. తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా జిల్లా ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంతో పాటు కడప, బద్వేలు, జమ్మలమడుగు, పులివెందుల ఆర్డీవో కార్యాలయాల్లో 24 గంటలు పని చేసేలా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. కడప జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్: 08562 – 246344, కడప రెవెన్యూ డివిజన్ కంట్రోల్ రూమ్: 08562 – 295990, జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ కంట్రోల్ రూమ్: 9440767485, బద్వేలు రెవెన్యూ డివిజన్ కంట్రోల్ రూమ్: 9182160052, పులివెందుల రెవెన్యూ డివిజన్ కంట్రోల్ రూమ్: 7396167368
Read Also: Supreme Court: యూట్యూబ్‌లో నగ్న ప్రకటనలు.. సుప్రీంకోర్టులో దావా వేసిన యువకుడు
అటు నెల్లూరు జిల్లాలో మాండూస్ తుఫాన్ పరిస్థితిపై పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ విజయారావు సమీక్షించారు. జిల్లా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా 6304386639 నెంబర్‌తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. రెవెన్యూ, మున్సిపల్, గ్రామ పంచాయతీ అధికారుల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలన్నారు. వాగులు, వంకలు, చెరువులు, జలాశయాలు, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలింపునకు సిద్ధంగా ఉండాలన్నారు. గాలుల కారణంగా ప్రజలకు, ప్రజా రవాణా వ్యవస్థకు ఇబ్బంది కలగకుండా చూడాలని.. రోడ్లపై విరిగిన చెట్లను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సహాయక చర్యల కొరకు పోలీసు ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచామన్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి వచ్చినా, సమస్యలకు గురైనా వెంటనే డయల్ 100 లేదా కంట్రోల్ రూంకు సమాచారం తెలిపాలన్నారు.