2040 వరకు క్రియాశీలక రాజకీయాల్లో ఉంటా.. రేవంత్ కీలక వ్యాఖ్యలు..
2040 వరకు క్రియాశీలక రాజకీయాల్లో ఉంటానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కళ్యాణ్‌నగర్ టీజీ జెన్కో ఆడిటోరియంలో ప్రముఖ కవి అందేశ్రీ రచించిన హసిత భాష్పాలు పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సమాజం కవులకు, పోరాటానికి స్ఫూర్తినిచ్చిన గడ్డ అని అన్నారు. ఉద్యమంలో ప్రజలకు స్ఫూర్తిగా గూడ అంజన్న, దశరథి, కాళోజీ, అందెశ్రీ, గద్దర్, గోరెటి వెంకన్న లాంటి కవులు నిలిచారని గుర్తు చేశారు. తనపై తనకు సంపూర్ణ నమ్మకం కలిగించి, కార్యోన్ముకిన్ని చేసి యుద్ధ రంగానికి సిద్ధం చేసిన వ్యక్తి శ్రీకృష్ణుడు అని అన్నారు. తాను కొంచెం ఓపెన్‌గా మాట్లాడుతానని, ఎక్కువ టైమ్ రాజకీయ కార్యక్రమాలకు ఇస్తానని, ఎందుకుంటే అక్కడ తాము మాట్లాడేదే ఫైనల్ ఉంటుందని అన్నారు. కానీ ఈ పుస్తకావిష్కరణలకు రావాలంటే పదంపదం ప్రిపేర్ అయ్యి రావాలని అన్నారు. అసలైన ఉద్యమకారులు ఎవరు కూడా తాము ఉద్యమకారుణ్ణి అని చెప్పుకోలేదని, కొద్ది మంది ఉద్యమకారులని చెప్పుకునే వాళ్లకి టీవీలు, పేపర్లు, వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో తనకు అర్థం కావడం లేదన్నారు.
నక్సలైట్లు దేశ భక్తులని అంటున్నారు..
నక్సలైటులే దేశ భక్తులు అని కొంత మంది అర్బన్ నక్సలైట్లు చూపే ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. నక్సలైటు లు ఏ దేశానికి భక్తులు?.. నక్సలిజాన్ని అంత మొందించడమే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లక్ష్యం.. నక్సలిజం ఇప్పటి వరకి సాధించినది శూన్యం.. ఛత్తీస్‌గఢ్ లో పేదరిక నిర్మూలన జరిగిందా.. జాతీయ పతాకాన్ని ఎగుర వేసే పరిస్థితి లేదు.. నక్సలైట్లు తుపాకీ గొట్టం ద్వారా సాధించినది ఏమిటి? అని క్వశ్చన్ చేశారు. భద్రతా, అభివృద్ధి, ప్రజల భాగస్వామ్యంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. అయితే, భారతదేశంలో నక్సలిజం నిర్మూలించడంలో కేంద్ర ప్రభుత్వం సక్సెస్ అయ్యింది అని కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ నక్సల్స్ తో చర్చలు జరుపాలని కోరారు.. అపరేషన్ కాగార్ ఆపాలని కోరారు.. రేవంత్ రెడ్డికి నక్సలిజంపై ద్వంద విధానం ఉంది.. రాష్జ్త్రంలో నక్సలైట్స్ పై నిషేధం విధించారు.. కేంద్రం మాత్రం చర్చలు జరపాలని అంటారు అని ఎద్దేవా చేశారు.
రెండోసారి కూలిన కాఫర్ డ్యామ్.. పోలవరాన్ని కూలవరం అనే దమ్ము వాళ్లకు ఉందా?
పోలవరం కాఫర్ డ్యామ్ రెండోసారి కూలలేదా?.. కాంగ్రెస్, బీజేపీకి పోలవరాన్ని కూలవరం అనే దమ్ముందా? అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కాళేశ్వరం విషయంలో ఒక విధానం, పోలవరం విషయంలో మరో విధానమా? అని ప్రశ్నించారు.. పోలవరం కాఫర్ డ్యామ్‌పై ఎన్‌డీఎస్ఏ మౌనం ఎందుకు? అని నిలదీశారు. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. జాతీయ హోదా ఇచ్చి మరీ.. సాక్షాత్తూ ఎన్డీఏ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం కాఫర్ డ్యామ్, రెండో సారి కొట్టుకుపోయినా NDSA కు కనిపించడం లేదా? కాళేశ్వరంలోని మేడిగడ్డలో రెండు పిల్లర్లకు పగుళ్లు వస్తే కూలేశ్వరం అని కారుకూతలు కూసిన కాంగ్రెస్-బీజేపీ నేతలకు “పోలవరంను.. కూలవరం” అనే దమ్ము ధైర్యం ఉందా..? తెలంగాణకు వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక నీతి.. పోలవరం ప్రాజెక్టుకు మరో నీతా ? అసెంబ్లీ ఎన్నికల వేళ అత్యంత అనుమానాస్పదంగా కుంగిన మేడిగడ్డ పిల్లర్లపై కేవలం 24 గంటల్లోపే NDSA ను దించి బీఆర్ఎస్ పై బురజల్లిన బీజేపీ నేతలు.. కళ్లముందు రెండోసారి కొట్టుకుపోయిన పోలవరం కాఫర్ డ్యామ్ పై ఎందుకు మౌనంగా ఉన్నారు ?ఏకంగా 10 అడుగుల వెడల్పు.. 7 నుంచి 8 అడుగుల లోతుకు కుంగిన పోలవరం కాఫర్ డ్యామ్ ను గుట్టుచప్పుడు కాకుండా ఏపీలో యుద్ధప్రాతిపదికన రిపేర్ చేస్తుంటే.. తెలంగాణలో మాత్రం 20 నెలలు కావస్తున్నా మేడిగడ్డ బ్యారేజీ వద్ద తట్టెడు సిమెంట్ కు దిక్కులేకపోవడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి మూర్ఖత్వమే.
ఆర్ఎస్ఎస్కు స్వాతంత్య్ర సంగ్రామంతో ఎలాంటి సంబంధం లేదు
స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రాణాలర్పించిన ఆజాద్ చంద్రశేఖర్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు పేర్లు ప్రధాన ప్రస్తావించకపోవడం శోచనీయం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. స్వాతంత్ర్య సంగ్రామంలో కాంగ్రెస్, సీపీఐదీ తిరుగులేని పాత్ర.. ఆర్ఎస్ఎస్ కు స్వాతంత్ర సంగ్రామంతో ఎలాంటి సంబంధం లేదు అని తేల్చి చెప్పారు. ఆర్ఎస్ఎస్ ను ప్రధాన మంత్రి మోడీ ప్రశంసించడం సీపీఐ ఖండిస్తోంది.. దేశంలో పేదరికం తగ్గిందని ప్రధాని ప్రస్తావించారు.. అయితే, 50 కోట్ల మంది వరకు బియ్యం, గోధుమలు, ఉచిత రేషన్ కార్డుల ద్వారా ఎందుకు పంపిణీ చేస్తున్నారు అని ప్రశ్ని్ంచారు. అలాగే, పోలవరం ప్రాజెక్టు ఎత్తు 47.72 అడుగుల మేర కేంద్ర ప్రభుత్వం నిర్మించాలి అని డిమాండ్ చేశారు. 196 టీఎంసీల నీరు నిల్వ చేయాలి.. పోలవరం నిర్వాసితులకు పరిహారం పంపిణీ, ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి అని సీపీఐ రామకృష్ణ కోరారు. పోలవరం- బనకచర్ల ప్రాజెక్టు ఒక అంబక్ ప్రాజెక్ట్.. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పథకం ప్రారంభించడం సీపీఐ స్వాగతిస్తోంది.. ఆర్టీసీలో 3 వేల బస్సులు కొనుగోలు చేసి మహిళలకు ఉచిత ప్రయాణం సాఫీగా సాగేలా చేయాలి అని కోరారు. రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన ప్రభుత్వ రంగ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాలి.. అలాగే, ప్రభుత్వ ఆధ్వర్యంలోని కళాశాలలో నాణ్యమైన విద్య బోధించేలా చర్యలు తీసుకోవాలి సీపీఐ రామకృష్ణ డిమాండ్ చేశారు.
నూర్ మహమ్మద్ పై దేశద్రోహం కేసు.. కాసేపట్లో కదిరి కోర్టుకు నిందితుడు!
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంకు చెందిన నూర్ మహమ్మద్ పై ఉపా యాక్ట్ తో పాటు దేశద్రోహం కేసు నమోదు అయింది. ఇవాళ రాత్రికి కదిరి కోర్టులో నూరు మహమ్మద్ ను పోలీసులు ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే, జేషే మహమ్మద్ సంస్థకు సంబంధించిన దాదాపు 29 ఉగ్రవాద సంస్థల గ్రూపుల్లో నూర్ కీలక సభ్యుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, నూర్ మహమ్మద్ కు చెందిన సెల్ ఫోన్ లోనీ డేటాను క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నట్లు తెలుస్తుంది. భారతదేశంలో ముస్లీం యువతను ఉగ్రవాదం వైపు మళ్లీంచే విధంగా నూర్ మహమ్మద్ ప్రేరేపించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, నూర్ మహమ్మద్ ఇంట్లో సోదాలు చేసి పోలీసులు 16 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జైషే మహ్మద్ సంస్థతో నూర్ మహమ్మద్ కు ఉన్న సంబంధాలు.. జైషే మహ్మద్ సంస్థకు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో సభ్యుడిగా ఉండటంతో మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. యువతను ఉగ్రవాదం వైపు మళ్లించేలా వాట్సాప్ గ్రూపుల్లో నూర్ వ్యాఖ్యలు చేసినట్లు తేలింది.
రేపు ఈసీ ప్రెస్మీట్.. బీహార్ ఓటర్ లిస్ట్, రాహుల్ ఆరోపణలపై రియాక్షన్!
ఎన్నికల కమిషన్ టార్గెట్ గా.. దేశంలో అనేక చోట్ల ఓటర్ జాబితాలో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సహా విపక్ష నేతలు ఆరోపణలు చేశాయి. వీటికి చెక్ పెట్టేందుకు ఈసీ రెడీ అయినట్లు సమాచారం. ఈ ఓట్ల చోరీ ఆరోపణలపై రేపు ( ఆగస్టు 17న) మీడియా సమావేశం నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే, బీహార్‌లో రాహుల్ గాంధీ ‘ఓటు అధికార్ యాత్ర’ను ప్రారంభించబోతున్న రోజే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే సమయంలో తప్ప.. ఇతర అంశాలపై ఎన్నికల కమిషన్ అధికారికంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం చాలా అరుదు. రేపు (ఆదివారం) నిర్వహించనున్న ప్రెస్ కాన్ఫరెన్స్ వెనుక అసలు కారణాన్ని తెలియజేయనప్పటికీ.. గత కొంతకాలంగా ఈసీపై వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టేలా ఈ ప్రెస్ మీట్ ఉండే ఛాన్స్ ఉంది. ప్రతిపక్షాలు ‘ఓటు చోరీ’ అనే పదాన్ని పదే పదే ఉపయోగించడాన్ని ఎన్నికల సంఘం ఇప్పటికే ఖండించింది. తప్పుడు కథనాలను ప్రచారం చేసే బదులు ఆధారాలు ఇవ్వాలని కోరింది.
రేపటి నుంచి బీహార్‌లో రాహుల్ గాంధీ యాత్ర..
బీహార్ ఎన్నికల సమరం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమీ పార్టీలు రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీహార్ ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆయన ఆగస్టు 17 నుంచి బీహార్‌లో యాత్ర చేపట్టనున్నట్లు హస్తం పార్టీ పేర్కొంది. ఈ యాత్రకు ‘ఓటర్ అధికార్ యాత్ర’ అని పేరు పెట్టినట్లు పార్టీ నాయకులు తెలిపారు. రోహ్తాస్ జిల్లా నుంచి ప్రారంభం కానున్న యాత్ర.. బీహార్ రాష్ట్రంలో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఈ ‘ఓటర్ అధికార్ యాత్ర’ చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఆయన రాష్ట్రంలో 16 రోజుల పాటు ఉండనున్నారు. ఈ సమయంలో ఆయన 24 జిల్లాల్లో పర్యటిస్తారని కాంగ్రెస్ ఎంపీ అఖిలేష్ సింగ్ తెలిపారు. యాత్రకు సంబంధించిన అన్ని సన్నాహాలు పూర్తయ్యాయని ఎంపీ తెలిపారు. సెప్టెంబర్ 1న పాట్నాలో జరిగే ర్యాలీతో ‘ఓటు అధికార్ యాత్ర’ ముగుస్తుందన్నారు. యాత్రలో ఇండియా కూటమీలోని అన్ని పార్టీల సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు.
ప్రభాస్ ఒక్క సినిమా రెమ్యూనరేషన్ తో 20 సినిమాలు?
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ అనే సినిమా రూపొందుతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ‘ఫౌజీ’ అనేది వర్కింగ్ టైటిల్‌గా ఉంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ ఒక సైనికుడిగా నటిస్తున్నారనే ప్రచారం ఉంది. ఒక లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమాని పీరియడ్ సెటప్‌లో రూపొందిస్తున్నారు. ఈ సినిమాకి భారీ బడ్జెట్ కావాల్సి వస్తోంది. దీంతో నిర్మాతలు ఒక ఆసక్తికరమైన ప్రతిపాదన ప్రభాస్ ముందు పెట్టినట్లుగా తెలుస్తోంది. అదేంటంటే, సినిమా మొత్తం పూర్తయ్యే వరకు రెమ్యునరేషన్ ఇవ్వలేమని, సినిమా పూర్తయిన తర్వాత డిజిటల్ రైట్స్ ఎంత వస్తే అంత మీకు ఇస్తామని ప్రభాస్ ముందు ప్రపోజల్ పెట్టినట్లు తెలుస్తోంది. నిర్మాతల మీద భారం పడకుండా ప్రభాస్ కూడా అందుకు ఒప్పుకున్నాడని అంటున్నారు. ప్రస్తుతానికి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి 150 నుంచి 180 కోట్ల వరకు డిజిటల్ రైట్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే, ప్రభాస్ ఈ సినిమాకి 150 నుంచి 180 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకునే అవకాశం ఉంది.
నా కెరీర్ లో స్టాలిన్ ఎంతో ప్రత్యేకం.. చిరు ఎమోషనల్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన మూవీ స్టాలిన్. 2006లో వచ్చిన ఈ సినిమాను నాగబాబు నిర్మించారు. ఈ సినిమా 2006లో వచ్చింది. ఆగస్టు 22న చిరంజీవి బర్త్ డే కానుకగా ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. స్టాలిన్ సినిమా నా కెరీర్ లో ఎంతో ప్రత్యేకం. ఆ సినిమా సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలని నేర్పించింది. ఎన్నో సినిమాల్లో నటించిన నాకు ఈ సినిమా ఒక గౌరవంగా అనిపిస్తుంది. దేశ సరిహద్దుల్లో యుద్ధం చేయడమే కాకుండా దేశం లోపల ఉన్న శత్రువులతో పోరాడాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది ఈ సినిమా. ఒక సోల్జర్ మాత్రమే దేశాన్ని అమితంగా ప్రేమిస్తాడు అనేది ఇందులోని కాన్సెప్ట్ అంటూ తెలిపారు చిరంజీవి. కేవలం శత్రువులతో పోరాడటమే కాకుండా తోటి వారికి సాయం చేయాలని ఇందులోని తన స్టాలిన్ పాత్ర చెబుతుందన్నారు. మనం ఎవరికైనా సాయం చేస్తే అక్కడితో దాన్ని వదలకుండా అవతలి వ్యక్తి కూడా మరో ముగ్గురుకు సాయం చేయాలని కోరడం వల్ల సాటి మనిషికి సాయం చేయాలనే తపన అందరిలోనూ పెరుగుతుందని అన్నారు మెగాస్టార్ చిరంజీవి.
షాహిద్ అఫ్రిదికి నోటి దూల ఎక్కువ.. నన్ను చూస్తే సైలెంట్ అవుతాడు!
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదిపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అఫ్రిదికి నోటి దూల ఇప్పుడే కాదు.. అతడు ఆడే రోజుల్లోనూ కూడా ఎక్కువగానే ఉండేదన్నారు. ఓసారి తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ఇర్ఫాన్ పఠాన్ చెబుతూ.. 2006లో పాక్ పర్యటనకు వెళ్లినప్పుడూ.. ఇరు జట్ల ప్లేయర్స్ అందరం కరాచీ నుంచి లాహోర్‌కు ఒకే ఫ్లైట్‌లో జర్నీ చేశాం.. నేను నా సీట్‌లో కూర్చొని ఉండగా అఫ్రిది వచ్చి.. నా తలపై చేయి వేసి నిమురుతూ.. ‘ఎలా ఉన్నావు బాబు?’ అని కామెంట్స్ చేశాడు.. ‘నువ్వెప్పుడు నాకు తండ్రిగా మారావు?’ అని అఫ్రిదిని క్వశ్చన్ చేశాను అని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. ఇక, అఫ్రిదివి పిల్ల చేష్టలు.. నాకు అతడు ఫ్రెండ్ కూడా కాదు.. ఆ తర్వాత కొన్ని అసభ్యకర వ్యాఖ్యలు ఉపయోగించాడు అని ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు. అయితే, నాకు కాస్త పక్కనే అతడి సీట్ ఉంది.. మరోవైపు, అబ్దుల్ రజాక్ సీట్‌లో ఉండగా.. అప్పుడు రజాక్‌ను ‘ఇక్కడ ఏ మాంసం లభిస్తుంది అని అడిగాను.. కొన్ని రకాలను అతడు చెప్పగా.. వెంటనే ఇక్కడ కుక్క మాంసం దొరుకుతుందా? అని అడిగాను.. రజాక్‌తో పాటు అఫ్రిది కూడా షాక్ అయ్యాడు. ‘హే ఇర్ఫాన్, ఎందుకు అలా అన్నావు?’ అని రజాక్ క్వశ్చన్ చేశాడు.. ఏం లేదు.. అఫ్రిది కుక్క మాంసం కూడా తిన్నాడేమో.. చాలా సేపటి నుంచి మొరుగుతూనే ఉన్నాడని అనడంతో అఫ్రిది అప్పటి నుంచి మౌనంగానే ఉన్నాడు. ఆ తర్వాత ఏమన్నా సరే.. ఇదిగో అతడు అరుస్తున్నాడంటూ కామెంట్ చేసేవాడిని.. దీంతో అప్పటి నుంచి నన్ను చూస్తే చాలు అఫ్రిది సైలెంట్ అవుతాడు అని ఇర్ఫాన్ వివరించాడు.