ఏపీలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఈ సంక్రాంతి సంబరాల్లో మునిగితేలడమే కాకుండా పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సంక్రాంతి సంబరాలను రెట్టింపు చేస్తూ ఏపీ ప్రజలకు తమ అధినేత కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ తరపున శుభాకాంక్షలు తెలుపుతూ భారీ ప్లెక్సీలు వెలిశాయి.
Vande Bharat Express starts tomorrow: రేపు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ నుంచి వందే భారత్ ట్రైన్ ప్రారంభం అవుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికి దేశవ్యాప్తంగా 5 ట్రైన్లను ప్రారంభించారని.. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య రేపు ప్రారంభం అయ్యే రైలు ఆరోదని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 100 వందేభారత్ ట్రైన్లను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ప్రధాని మంత్రి నరేంద్రమోదీ ఢిల్లీ నుంచి వందేభారత్ ట్రైన్ ను ప్రారంభిస్తారని వెల్లడించారు. ప్రోటోకాల్…
Andhra Pradesh: వైఎస్ఆర్ పేరుతో పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంక్రాంతి లక్కీడ్రాను నిర్వహించారు. ఈ లక్కీ డ్రాలో గుంటూరుకు చెందిన గుడే వినోద్ కుమార్ రూ. 16 లక్షల విలువైన వజ్రాల హారాన్ని దక్కించుకున్నాడు. జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం రాత్రి ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వరప్రసాద్, కల్పలతారెడ్డి, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మితో కలిసి మంత్రి అంబటి రాంబాబు లక్కీ డ్రా తీశారు. ఇందులో వినోద్ కుమార్ విజేతగా నిలిచి వజ్రాల…
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. తెలుగు లోగిళ్లలో కొత్త సందడి నెలకొంది. గ్రామాలన్నీ పండుగ సందడితో కళకళలాడుతున్నాయి. పల్లె, పట్నం అనే తేడా లేకుండా తెలుగు రాష్ట్రాల్లో బోగి మంటలు మండుతున్నాయి.
Off The Record: ఆంధ్రప్రదేశ్లో TTD బోర్డు బెజవాడ కనకదుర్గమ్మ గుడి పాలకమండళ్లకు ప్రాధాన్యం ఎక్కువ. ఈ రెండు ఆలయాలతోపాటు రాష్ట్రంలో పలు కీలక గుళ్లు ఉన్నప్పటికీ.. అక్కడి ట్రస్ట్ బోర్డుల గురించి పెద్దగా ప్రచారం ఉండదు. మిగతా కీలక ఆలయాల్లో పాలకమండలిని నియమించిన తర్వాత ఒకరోజో.. రెండు రోజులో చర్చ జరుగుతుంది. తర్వాత ఎవరూ పట్టించుకోరు. అలాంటి ఆలయాల్లో శ్రీశైలం కూడా ఒకటి. శ్రీశైలం ఆలయం పాలకమండలి చర్చల్లోకి వచ్చిన సందర్భాలు కూడా చాలా అరుదు.…