PeddiReddy: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ ఆదేశిస్తే కుప్పంలో చంద్రబాబుపై పోటీకి తాను సిద్ధంగా ఉన్నానని… పుంగనూరులో తనపై పోటీకి చంద్రబాబు సిద్ధమా అని ప్రశ్నించారు. రెండు చోట్ల పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. కుప్పంలో చంద్రబాబుకు ఈ దఫా డిపాజిట్ రావడం కుడా కష్టమేనన్నారు. తన మానసిక పరిస్థితి ఎలా ఉందో…
Road Accident: ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది.. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం చెన్నముక్కపల్లె రింగ్ రోడ్డు వద్ద ఈ ప్రమాదం జరిగింది… పెద్దిరెడ్డి రాంచంద్రా రెడ్డి, మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులందరూ సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు పుంగనూరు నుండి వీరబల్లిలోని అత్తగారి ఇంటికి బయల్దేరి వెళ్లారు.. అయితే, మార్గం మధ్యలో మరో కారు వచ్చి కాన్వాయ్‌ని ఢీకొట్టింది… ఎంపీ మిథున్ రెడ్డికి చెందిన వాహనాన్ని ఎదురుగా వచ్చి బలంగా…
కోడి పందాల్లో అపశృతి.. కోడి కత్తి గుచ్చుకుని ఇద్దరు మృతి తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి.. ఇక, సంక్రాంతి అనగానే ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు.. కోడి పందాలు, ఎద్దుల పోటీలు.. ఇలా అన్నీ జోరుగా సాగుతాయి.. కానీ, ఈ సారి కోడి పందాలు రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి.. కోడి కత్తి గుచ్చుకుని ఇద్దరు మృతిచెందారు.. రెండు వేర్వేరు ఘటనల్లో కోడి కత్తి గుచ్చుకుని ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. నల్లజర్ల మండలం అనంతపల్లిలో…
Ambati Rambabu vs Nagababu: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంక్రాంతి పండుగ కూడా కాకరేపుతోంది.. పండుగ సమయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ జనసేన పార్టీగా మారిపోయింది.. భోగీ సందర్భంగా ఉత్సాహంగా డ్యాన్స్‌లు వేశారు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు.. ఇక, భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ.. ఆయన మహిళలు, గిరిజన మహిళలతో కలిసి డ్యాన్స్ చేసిన ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.. ఇదే తాజా మాటల యుద్ధానికి కారణమైంది.. ఆ…
Supreme Court: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న గంగిరెడ్డి బెయిల్ రద్దు వ్యవహారంపై తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు.. గంగిరెడ్డికి మంజూరైన బెయిల్ రద్దు అంశంపై విచారణను హైకోర్టుకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.. ఈ కేసులో గంగిరెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ హైకోర్టులో మరోసారి విచారణ జరపాలని సూచించింది దేశ…
Chandrababu Go Back Flexis: సైకో చంద్రబాబు గో బ్యాక్.. గో బ్యాక్ చంద్రబాబు.. పుంగనూరులో మతకలహాలు సృష్టిస్తూన్న చంద్రబాబు గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తెలుగు దేశం పార్టీ గూండాల దాడి.. టీడీపీ గూండాలు గొడవలు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నిస్తున్న కొన్ని ఫొటోలను జోడించి పెద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.. ఈ ఫ్లెక్సీలకు అన్నమయ్య జిల్లా పీలేరు వేదికైంది.. చంద్రబాబు గో బ్యాక్…
Cock fight: తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి.. ఇక, సంక్రాంతి అనగానే ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు.. కోడి పందాలు, ఎద్దుల పోటీలు.. ఇలా అన్నీ జోరుగా సాగుతాయి.. కానీ, ఈ సారి కోడి పందాలు రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి.. కోడి కత్తి గుచ్చుకుని ఇద్దరు మృతిచెందారు.. రెండు వేర్వేరు ఘటనల్లో కోడి కత్తి గుచ్చుకుని ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. Read Also: Ajit Pawar: తృటిలో తప్పించుకున్నా.. లేకపోతే బ్రేకింగ్ న్యూస్…
ఆ కారుకు నా హృదయంలో ప్రత్యేక స్థానం.. రతన్ టాటా పోస్ట్ వైరల్ రతన్ టాటా పరిచయం అవసరం లేని పేరు.. టాటా గ్రూప్‌ను రూపొందించిన రతన్ టాటా.. వ్యాపారంలోనే కాదు సామాజిక సేవలోనే ఎంతో పేరు పొందారు.. ఆయనకు సోషల్ మీడియాలో పెద్ద అభిమానుల ఫాలోయింగ్‌ను కూడా కలిగి ఉన్నారు.. ఆయన అనేక త్రోబాక్ పోస్ట్‌లను పంచుకుంటూ ఉంటారు.. అయితే, ‘టాటా ఇండికా’ను ప్రారంభించిన 25 సంవత్సరాలు అవుతోన్న సందర్భాన్ని పురస్కరించుకుని.. ఓ భావోద్వేగ పోస్టును…
Kothapeta Prabhala Utsavam: మకర సంక్రాంతి సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ప్రభల ఉత్సవం కన్నుల పండువగా జరిగింది. ఉభయగోదావరి జిల్లాల నుంచి తరలివచ్చిన జనంతో కొత్తపేట వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. పోటాపోటీగా సాగిన బాణసంచా కాల్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆదివారం ఉదయం పాత రామాలయం, కొత్త రామాలయం, బోడిపాలెం వీదుల ప్రభల ఊరేగింపు కొత్తపేట ప్రధాన పురవీధుల్లో సాగింది. ఈ మూడు ప్రధాన వీధుల ప్రభలను…