మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ రోజు నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్నారు.. రుస్తుం మైనింగ్ కేసుల్లో కాకాణికి బెయిల్ మంజూరు చేస్తూ సోమవారం రోజు తీర్పును వెలవరించింది ఏపీ హైకోర్టు.. అయితే, కాకాణిపై మొత్తం ఎనిమిది కేసులు నమోదు కాగా.. వివిధ కోర్టుల్లో బెయిల్ దొరికింది.. దీంతో, 85రోజులుగా జైల్లో ఉన్న కాకాణి గోవర్దన్‌రెడ్డి ఈ రోజు జైలు నుంచి విడుదల కాబోతున్నారు..
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తన అధికారిక ఎక్స్ ఖాతాలో చేసిన పోస్టులో.. విశాఖ స్టీల్ పై కేంద్రానిది ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్.. ఆదుకోవడం పచ్చి అబద్ధం.. ఉద్ధరించడం అంతా బూటకం.. ప్రైవేటీకరణ లేదంటూనే ప్లాంట్ లో 44 EOI లకు ప్రైవేట్ కాంట్రాక్టర్లను పిలవడం దారుణం.. ఇది ప్లాంట్ ను చంపే కుట్రలో భాగమే.. 5 వేల మంది కార్మికులను ఎందుకు తొలగించారు ?.. ఆ పనులను ఎందుకు…
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం జరిగింది. అమరావతి నిర్మాణంలో పలు కీలక నిర్ణయాలపై చర్చించారు. రాజధాని లో పలు సంస్థలకు భూ కేటాయింపులు చేశారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ‘అమరావతి లో ఉన్న గ్రామ కంఠాల అభివృద్ధి కి సీఆర్డీఏ ఆమోదం తెలిపింది.. 904 కోట్లు 29 గ్రామాలకు కేటాయిస్తూ సీఆర్డీఏ నిర్ణయం తీసుకుంది.. నీటి సరఫరా…కు 64 కోట్లు…సీవరేజ్ కోసం 110 కోట్లు..రోడ్లు..కోసం..300 కోట్లు..కేటాయిస్తూ సీఆర్డీఏ నిర్ణయం తీసుకుంది. వచ్చే కేబినెట్ లో అనుమతి…
విశాఖపట్నంలో డేటా సిటీని అభివృద్ధి చేయడం వల్ల భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ హబ్ గా తయారవుతుందని చెప్పారు, దీనికి సహకారం కావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్లే కార్మికుల సంక్షేమం, భద్రత, గౌరవాన్ని కల్పించేందుకు ప్రవాస భారతీయ బీమా యోజన వంటి పథకాలను విస్తరించాలి, సంబంధిత ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏపీలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయండి. ఆంధ్రప్రదేశ్ లో జాతీయ, అంతర్జాతీయస్థాయి స్కిల్ కాంక్లేవ్ నిర్వహణలో భాగస్వామ్యం కల్పించినందుకు కృతజ్ఞతలు.
చంద్రబాబు బానే ఉంటారు.. భవిష్యత్తులో పోలీసు అధికారులు ఇబ్బందులు పడతారని హెచ్చరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.. ఏపీ లిక్కర్ స్కామ్ అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో ఇవాళ అనంతపురం వైసీపీ నేతలు ములాఖాత్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, సుగాసి బాల సుబ్రమణ్యం.. మిథున్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజకీయ కక్ష…
తనను తాడిపత్రి వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇచ్చేంత వరకు రోడ్డుపైనే బైఠాయిస్తాను అంటున్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి.. హైకోర్టు తీర్పు చారిత్రాత్మకం.. హైకోర్టు తీర్పు వల్లే 14 నెలల తర్వాత తాడిపత్రికి వెళ్తున్నాను.. కానీ, హైకోర్టు ఆదేశాలను కూడా పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు..