ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రిన్సిపల్ సౌమ్య ఆరోపణలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కూన రవికుమార్ మాట్లాడుతూ.. నాపై కెజిబివి ప్రిన్సిపాల్ సౌమ్య అసత్య ఆరోపణలు చేశారు.. సభ్య సమాజం ఆమె ఆరోపణలు చూసి తలదించుకునే విధంగా ఉన్నాయి.. జెడ్పిటిసి నుంచి ఎమ్మెల్యేగా వివిధ పదవులు నిర్వహించాను.. నాపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయటం దారుణం.. వైసీపీ తోక నాయకులు నాపై ఆరోపణలు చేస్తున్నారు.. నేను శారీరకంగా మానసికంగా హింసించినట్టు ఆధారాలు చూపించు.. తల్లిదండ్రుల ఫిర్యాదులు వస్తే…
హోంమంత్రి అనిత ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మంత్రి అనిత మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఉమ్మడి రాష్ట్రం నుంచి 21 మంది సీఎం లను చూశాం. కానీ, ఆంధ్రప్రదేశ్ సీఎం అంటే టక్కున చంద్రబాబు గుర్తొస్తారు.. ఆర్ధికంగా ఇబ్బంది ఉన్నా ప్రజలకు మంచి చెయ్యాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు పని చేస్తారు.. 14 ఏళ్ల సీఎం చంద్రబాబు ప్రయాణంలో సంక్షేమం.. అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు.. ఈ నెలలోనే అన్నదాత సుఖిభవ..స్త్రీ శక్తి పథకాలను ప్రారంభించాము.. ఈ 14 నెలల్లో…
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. జస్టిస్ ఎం ఎం సుందరేష్, ఎంకే సింగ్ ల ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టింది.. అయితే, ఈ కేసులో తదుపరి విచారణను సెప్టెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది.. ఈ కేసులో తదుపరి సీబీఐ విచారణ అవసరమా? లేదా? అనేదానిపై సమయం కోరారు అడిషనల్ సొలిసిటర్ జనరల్ కే ఎస్ ఎన్ రాజు.. దీంతో, తదుపరి విచారణ పై అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది..
ఇప్పుడు శ్రీవాణి దర్శన టిక్కెట్ల సంఖ్య పెంచే యోచనలో ఉంది.. ప్రస్తుతం జారి చేస్తున్న 1500 టిక్కెట్లను 2 వేలకు పెంచేందుకు వున్న అవకాశాలను పరిశీలిస్తున్నారు టీటీడీ ఉన్నతాధికారులు.. ప్రస్తుతం నిత్యం ఆన్ లైన్ లో 500 టిక్కెట్లు.. ఆఫ్ లైన్ లో 1000 టిక్కెట్లు జారీ చేస్తూ వస్తుంది టీటీడీ.. అయితే, ఆఫ్లైన్లో ఉన్న డిమాండ్ దృష్ట్యా.. ఆఫ్ లైన్ లో మరో 500 టిక్కెట్లు పెంపునకు వున్న అవకాశాలను పరిశీలిస్తుంది టీటీడీ.. ఆఫ్ లైన్…
జీవిత ఖైదీ శ్రీకాంత్ ప్రియురాలు అరుణ ఫేస్బుక్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు.. శ్రీకాంత్ పెరోల్ మంజూరు, రద్దు తరువాత పలు అంశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు అరుణ.. శ్రీకాంత్ ను వాడుకున్న వాళ్లు ఎవ్వరూ ఇప్పుడు నోరు మెదపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. శ్రీకాంత్ బాధ పడుతుంటే మీకు ఇష్టం అని అర్థం అవుతుంది.. పరిస్థితి ఇక్కడి వరకు వచ్చాక నేను ఎందుకు నోరు విప్పకూడదు..? అని ప్రశ్నించింది..
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దెబ్బకు మహిళలు హడలిపోతున్నారు అంటూ ధ్వజమెత్తారు వైసీపీ అధికార ప్రతినిధి ఆరే శ్యామల.. అంతేకాదు.. టీడీపీ నేతలు మొత్తం ఆ పార్టీ నేత నందమూరి బాలకృష్ణ చెప్పిన మాటలు ఫాలో అవుతున్నారు అంటూ సెటైర్లు వేశారు..
లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లు డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఏసీబీ కోర్టు. కేసులో ఏ4గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఏ31 రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ఆడిటర్ బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్లు డిస్మిస్ అయ్యాయి.
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. ఘాట్ రూట్లలో కూడా స్త్రీ శక్తి పథకం వర్తింపు చెయ్యాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.. స్త్రీశక్తి ఉచిత బస్సు పథకానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని గుర్తించారు.. సోమవారం ఒక్క రోజే 18 లక్షల మంది ఉచిత ప్రయాణాలు చేశారు.. జీరో ఫేర్ టికెట్ ద్వారా మహిళలకు రూ.7 కోట్లకు పైగా ఆదా అయినట్టు ఆర్టీసీ లెక్కలు చెబుతున్నాయి.. 4 రోజుల్లో 47 లక్షల మంది ప్రయాణం…