ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం తొలగించడంతో నందిగామలో ఉద్రిక్తత వాతావరణానికి కారణం అయ్యింది.. ట్రాఫిక్కు అడ్డుగా ఉందని రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని అర్ధరాత్రి సమయంలో తొలగించారు మున్సిపల్ అధికారులు... గాంధీ సెంటర్ లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం తొలగించిన ప్రదేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దేవినేని అవినాష్, గౌతమ్, రెడ్డి, మొండితోక జగన్ మోహన్ రావు ఆందోళనకు దిగారు..
వర్ రాయుడు హత్యకేసులో శ్రీకాళహస్తికి చెందిన జనసేన పార్టీ మాజీ ఇంఛార్జ్, జనసేన బహిష్కృత నేత వినుత కోటకు బెయిల్ దొరికింది.. రాయుడు హత్య కేసులో A3గా ఉన్న శ్రీకాళహస్తి జనసేన పార్టీ బహిష్కృత నేత వినుత కోటకు బెయిల్ మంజూరు చేసింది మద్రాస్ చీఫ్ సెషన్స్ కోర్టు.. అయితే, ప్రతి రోజు ఉదయం 10 గంటలలోపు C3 సెవెన్ వెల్స్ చెన్నై పోలీస్ స్టేషన్ లో సంతకం చేయాలని షరతులు పెట్టింది కోర్టు.
రాజావరంలో ఓ మహిళ 20 లీటర్ల సారా, 400 లీటర్ల బెల్లపూట కలిగి ఉండటంతో అదుపులోకి తీసుకున్నారు. వీటితో పాటు డ్రమ్ములు, గ్యాస్ స్టౌవ్ లను స్వాధీనం చేసుకున్నారు.
MLC Bommi Israel: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ మరో 15 ఏళ్లు చంద్రబాబు దగ్గరే పని చేస్తానంటున్నారు..
Govt employee Kidnap: అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో నెలకొన్న ఓ కిడ్నాప్ కేసు మిస్టరీగా కొనసాగుతుంది. దేవీపట్నం మండలం శరభవరం గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగి సోయం శ్రీ సౌమ్య (26) ని ఐదుగురు వ్యక్తులు నిన్న ఉదయం కిడ్నాప్ చేశారు.
తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఉత్తరాంధ్ర. 2024 ఎన్నికల ఫలితాలు, ఇక్కడ ఆ పార్టీ ఎమ్మెల్యేలకు వచ్చిన మెజార్టీలే అందుకు నిదర్శనం. అందులోనూ గ్రేటర్ విశాఖ సిటీలో అయితే సైకిల్ సవారీకి ఎదురే లేకుండా పోయింది. కూటమి కట్టినా...ఒంటరిగా పోటీ చేసినా సిటీ పరిధిలోని నాలుగు స్ధానాలు టీడీపీ ఖాతాలోనే పడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్ట్ పోలవరం. కానీ... అదే పోలవరం ఎమ్మెల్యే విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు కొత్త కొత్త వివాదాలు రేగుతూ... రాజకీయంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఆ వ్యవహారాల్లో ఈ జనసేన ఎమ్మెల్యే ప్రమేయం ఉందా లేదా అన్న సంగతి పక్కనబెడితే... వోవరాల్గా హైలైట్ అవుతోంది మాత్రం ఆయనే. అది ఇటు ప్రభుత్వానికి, అటు పార్టీకి తలనొప్పిగా మారుతున్నట్టు చెప్పుకుంటున్నారు.
ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా, చెడ్డ పేరు తేవాలన్నా శాసనసభ్యులే కీలకం. నియోజకవర్గాల్లో వాళ్ళు, వాళ్ల అనుచరుల వ్యవహారాలు, ప్రవర్తనను బట్టే ప్రభుత్వం మీద ప్రజలకు ఓ అభిప్రాయం కలుగుతుంది. కానీ... ప్రస్తుతం ఏపీలోని చాలా మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు కట్టు తప్పుతున్నారన్న నివేదికలు అందుతున్నాయట ప్రభుత్వ పెద్దలకు. దాన్ని దృష్టిలో పెట్టుకునే సీఎం చంద్రబాబు..