CM Chandrababu: ఎమ్మెల్యేలు మాట వినకపోతే ఇక మాటల్లేవ్… అని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇకపై మాటల్లేవ్… యాక్షన్ మాత్రమే ఉంటుందన్నారు.. గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలకు సరిచేసుకోమని ఒకసారి చెప్తా అన్నారు.. అయినా తీరు మారకుంటే రెండో సారి పిలిచి చెప్తా…, అప్పటికీ మారకుంటే ఇక చెప్పటాలుండవు, నేను తీసుకోవాల్సిన చర్య తీసుకుంటా అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు.. సమన్వయ కర్తలు, ఇన్ఛార్జ్ మంత్రులు ఈ విషయాన్ని ఎమ్మెల్యేలకు అర్ధమయ్యేలా చెప్పాలన్నారు.. కూటమి బాగుంటేనే ప్రజలూ బాగుంటారు అనే విషయాన్ని ఎమ్మెల్యేలకు చెప్పాలన్నారు సీఎం చంద్రబాబు…. టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు… ప్రజాప్రతినిధులే తప్పులు చేసుకుంటూ వెళ్లటం ఎంతమాత్రం సరికాదన్నారు..
Read Also: VP Elections: వీపి ఎన్నికకు విప్ లేదు.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీల ఓటు ఎటువైపు
ఇప్పటి వరకూ దాదాపు 35 మంది ఎమ్మెల్యేతో ముఖాముఖి నిర్వహించా.. గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలకు సరిచేసుకోమని ఒకసారి చెప్తా అయినా తీరు మారకుంటే రెండో సారి పిలిచి చెప్తా…, అప్పటికీ మారకుంటే ఇక చెప్పతాలుండవు , నేను తీసుకోవాల్సిన చర్య తీసుకుంటాను అని స్పష్టం చేశారు చంద్రబాబు.. సీనియర్లు ఎంతో బాధ్యత గా ఉంటుంటే…., తొలిసారి ఎమ్మెల్యేలు అయిన వాళ్లు మరింత బాధ్యత గా ఉండాల్సింది పోయి కొందరు గాడి తప్పుతున్నారు.. ఇలాంటి చర్యలు ఉపేక్షించను ఎన్నికలప్పటికంటే ప్రజల్లో మన పట్ల సానుకూలత ఇప్పుడు ఇంకా మెరుగుపడింది.. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు ఎమ్మెల్యేలు వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా ఉంటే ఎంత మాత్రం ఉపేక్షించను అని వార్నింగ్ ఇచ్చారు.. మరోవైపు, ఇక, సెప్టెంబర్ 6న సూపర్ 6 – సూపర్ హిట్ పేరిట అనంతపురం లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు..
Read Also: Off The Record: అక్కడ టీడీపీ ఎమ్మెల్యే దంపతులు దొరికినకాడికి దోచేస్తున్నారా..?
ఇక, పార్లమెంట్ కమిటీల కూర్పుపై సమావేశం నిర్వహించారు చంద్రబాబు.. సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి 75 మంది పార్టీ నేతలు హాజరయ్యారు.. పార్లమెంట్ పార్టీ కమిటీల ఏర్పాటు కోసం ఏర్పాటు చేసిన త్రి సభ్య కమిటీలతో చంద్రబాబు భేటీ అయ్యారు.. ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు నాయుడు.. అధికారంలోకి వచ్చిన తరవాత అనేక సవాళ్లు ఎదుర్కొన్నాం.. గత ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసింది. అయినా అన్నీ ఎదుర్కొని మనం సంక్షేమం చేస్తున్నాం.. అభివృద్ది ఆగకుండా చూస్తున్నాం.. సూపర్ సిక్స్ అని చెప్పాం… చెప్పినట్లు అన్ని పథకాలు అమలు చేస్తున్నాం. సూపర్ సిక్స్ ను సూపర్ హిట్ చేశామని తెలిపారు. మేనిఫెస్టోలో అనేక హామీలు ఇప్పటికే నెరవేర్చాం. పథకాలు సకాలంలో అమలు వల్ల ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ప్రతి వర్గానికి ఏదోక లబ్ది చేకూర్చాం. ఏడాది కాలంలో ఇన్ని పనుల చేయడం గొప్ప ముందడుగుగా అభివర్ణించారు.. అయితే, వైసీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తూనే ఉంది.. వాళ్లు ఫేక్ ప్రచారాలనే రాజకీయ సిద్దాంతంగా పెట్టుకుని రోజువారీ రాజకీయం చేస్తున్నారు అని మండిపడ్డారు చంద్రబాబు.. ప్రజల సమస్యలు, ప్రజల ప్రయోజనాలు వాళ్లకు అనవసరం. వాళ్లకు కావాల్సింది.. రాద్దాంతం.. తప్పుడు ప్రచారం.. మంచిపై చర్చ జరగకుండా చూడడం.. నిత్యం తప్పుడు ప్రచారంతో ప్రభుత్వ పథకాలపై, మంచి కార్యక్రమాలపై చర్చ జరగకుండా చేస్తున్నారు. అమరావతి మునిగిపోయింది… ప్రకాశం బ్యారేజ్ గేట్లు కొట్టుకుపోయాయి అంటూ అనేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు..