* నేడు ఉదయం 11: 30గంటలకి హైదరాబాద్ కు ఏపీ సీఎం చంద్రబాబు.. మధ్యాహ్నం 12 గంటలకు మగ్దూం భవన్ కు ఏపీ సీఎం చంద్రబాబు.. కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించనున్న సీఎం చంద్రబాబు..
* నేడు తిరుపతి జిల్లాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటన..
* నేడు పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం.. పాల్గొనున్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర..
* నేడు విశాఖపట్నంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన.. జనసేన విస్తృతస్థాయి సమావేశ ఏర్పాట్లపై సమీక్ష.. మధ్యాహ్నం ఒంటి గంటకు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రెస్ మీట్..
* నేడు అక్రమ మైనింగ్ కేసులో ఐఓ ముందుకు మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి.. హైకోర్టు ఆదేశాలతో ఐఓ ముందు హాజరుకానున్న కాకాణి..
* నేటి నుంచి దశల వారిగా విశాఖపట్నంలో కార్మిక, ప్రజాసంఘాల జేఏసీ నిరసనలకు పిలుపు.. సెప్టెంబర్ 3న జగదాంబ జంక్షన్ నుంచి మహా ప్రదర్శన.. స్లీల్ ప్లాంట్ ను ప్రభుత్వమే కొనసాగించాలని డిమాండ్..
* నేడు నల్గొండలో మంత్రులు కోమటిరెడ్డి, దామోదర రాజనర్సింహ పర్యటన.. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, మెడికల్ కాలేజీ పరిశీలన.. జిల్లా అధికారులతో సమీక్షించనున్న కోమటిరెడ్డి, దామోదర..
* నేడు చొప్పదండి నియోజకవర్గంలో జనహిత పాదయాత్ర.. గంగాధర మండలం ఉప్పరమల్యాల నుంచి మధురానగర్ వరకు కొనసాగనున్న జనహిత పాదయాత్ర.. యాత్రలో పాల్గొననున్న మీనాక్షి నటరాజన్, నేతు..
* నేడు సిద్దిపేటలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన.. నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న హరీష్ రావు..
* నేడు శేరిలింగంపల్లిలో బీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశం.. సమావేశానికి హాజరుకానున్న కేటీఆర్..
* నేడు ఎల్బీనగర్ లో బీజేపీ సోషల్ మీడియా వర్క్ షాప్.. బీజేపీ వర్క్ షాప్ లో పాల్గొననున్న రామచందర్ రావు, నేతలు..
* నేడు మగ్దూం భవన్ కు సురవరం భౌతికకాయం.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజల సందర్శనార్థం.. పార్టీ ఆఫీసులో సురవరం పార్థివదేహం ఉంచనున్న నేతలు..
* నేడు తెలంగాణలోని పలు జిల్లాలో భారీ వర్షాలు.. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రిలో వర్షాలు..
* నేటి నుంచి ఢిల్లీలో ఆల్ ఇండియా స్పీకర్ల సమావేశం.. సదస్సును ప్రారంభించనున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా..
* నేడు జమ్ము కాశ్మీర్ లో కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటన.. కిష్త్వార్ లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన.. వరద నష్టం అంచనా వేయనున్న రాజ్ నాథ్ సింగ్.. బాధితులకు సహయక చర్యలపై ఆరా తీయనున్న రాజ్ నాథ్..
* నేడు చెన్నైకి ఇండియా కూడా ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి.. తమిళనాడు సీఎం స్టాలిన్ మద్దతు కోరనున్న ఇండి కూటమి అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి..
* నేటి నుంచి యూఎస్ గ్రాండ్ స్లామ్ టోర్నీ ప్రారంభం.. టైటిల్ ఫెవరేట్లుగా అల్కరాజ్, జానిక్ సిన్నర్.. ఇటీవలే వింబుల్డన్ గెలిచిన జానిక్ సిన్నర్.. యూఎస్ గ్రాండ్ స్లామ్ విజేతకు రూ. 43.65 కోట్లు.. రన్నరప్ కు రూ. 21.82 కోట్ల ప్రైజ్ మనీ..