మంజుమ్మల్ బాయ్స్ మూవీ సీన్ రిపీట్ అయ్యింది. ఈ సినిమాలో ఫ్రెండ్స్ అంతా కలిసి కొడైకెనాల్ ట్రిప్ కు వెళ్తారు. అక్కడ అందమైన ప్రదేశాలను చూసి చివరకు గుణ కేవ్స్ ను చూసేందుకు వెళ్తారు. ఈ క్రమంలో సుభాష్ అనే వ్యక్తి 150 అడుగుల లోతైన లోయలో పడిపోతాడు. తమ స్నేహితుడిని రక్షించుకునేందుకు మిగిలిన స్నేహితులు చేసే ప్రయత్నం స్నేహానికి ఉన్న విలువను చాటి చెప్పింది. ఇప్పుడు ఇదే తరహాలో ఓ పర్యాటకుడు పెనుకొండ కొండమీదికి వెళ్లి రీల్స్ చేస్తూ పడిపోయాడు. అధికారులు ఆ వ్యక్తిని రక్షించారు.
Also Read:CM Revanth Reddy : 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్తగా తెలంగాణ
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ కొండపై కిల్లాను సందర్శించేందుకు వెళ్లినా ఓ పర్యాటకుడు ప్రమాదవశాత్తు జారిపడి తీవ్ర గాయాలతో బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయాడు. విషయం తెలుసుకున్న స్థానిక అగ్నిమాపక కేంద్రాధికారి వెంకటేశులు సిబ్బందితో కలిసి కొండ మీదికి చేరుకొని అతి కష్టం మీద బాధితుడిని బయటకు తీసుకువచ్చారు. గాయపడిన పర్యాటకుడు తమిళనాడు వాసిగా గుర్తించారు. గాయపడిన వ్యక్తి గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలోని కియా అనుబంధ పరిశ్రమ డాంగ్ఏ కంపెనీలో ఐటి విభాగంలో మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం మిత్రులతో కలిసి రీల్ చేయడం కోసం పెనుకొండ కొండమీదికి వెళ్లారు. రీల్ చేస్తూ ప్రమాదవశాత్తు బండరాల మధ్య పడిపోయి తీవ్ర గాయాల పాలయ్యాడు. అగ్నిమాపక శాఖ అధికారులు బాధితుడిని వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.