Merugu Nagarjuna: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న పరిస్థితులను వివరించేందుకు డీజీపీ ఆఫీస్ కి వచ్చామని వైసీపీ నేత, మాజీ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. ఇక, పులివెందుల ఉప ఎన్నికలో జరుగుతున్న పరిణామాలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లాం.. అయినా స్పందన లేదు.. జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా మా పార్టీ వారిని భయబ్రాంతులకు గురి చేసే కుట్ర చేస్తున్నారు.
విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీని నడిపించే నాయకుడెవరు ? అధ్యక్షుడి స్థానాన్ని దక్కించుకునేది ఎవరు ? అందరినీ మెప్పించే, నడిపించే సారథిగా ఎవరికి అవకాశం దక్కుతుంది ? కుర్చీని నవతరం అందిపుచ్చుకుంటుందా? పాత సీనియర్లె సారథ్యం వహిస్తారా? ఇప్పుడు ఈ ప్రశ్నలే అక్కడ వినిపిస్తున్నాయి. ఇంతకీలో పోటీలో ఉన్న నాయకులు ఎవరు ?
ఆదివాసి సంక్షేమమే కూటమి లక్ష్యం అన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్... అల్లూరి సీతారామరాజు, ఏకలవ్యుడు, వెన్నెలకంటి రాఘవయ్య వంటి మహాపురుషుల సేవలను గుర్తించాలన్నారు.. సీఎం చంద్రబాబు సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ఆదివాసీలకు గుర్తింపు తెచ్చారని ప్రశంసలు కురిపించారు..
పండుగ పూట కొన్ని విషాద ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి.. తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో తన చెల్లి వద్దకు రాఖీ కట్టించుకోవడానికి వెళ్తూ.. అనంత లోకాలకు చేరాడు ఓ యువకుడు..
ఎన్నికల కమిషన్, కేంద్ర సర్కార్పై మరోసారి ఫైర్ అయ్యారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయిస్తున్నారని ఆరోపించారు. ఇక, బెంగళూరులోని బీజేపీ పార్టీకి చెందిన ఓ నేత అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష దొంగ ఓట్లు వేసుకున్నారని ఆరోపించారు..