Shweta Death Case: విశాఖపట్నంలో గర్భిణి శ్వేత మృతి కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.. ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక హత్య చేశారా? అనే విషయంలో పెద్ద సస్పెన్స్ కొనసాగింది.. ఈ కేసులో శ్వేత పోస్ట్‌మార్టం రిపోర్ట్ కీలంగా మారింది.. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత.. ఈ కేసులో కొన్ని షాకింగ్ విషయాలను మీడియాకు వెల్లడించారు విశాఖ పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ.. శ్వేత అనే అమ్మాయి మృత దేహం YMCA బీచ్ లో లభ్యం…
Minister Merugu Nagarjuna: మాజీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి మేరుగ నాగార్జున.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దళితుల గురించి చంద్రబాబు మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించడమే అన్నారు.. చంద్రబాబు లాంటి గజ దొంగ రాజకీయాల్లో ఉండడానికి అనర్హుడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. దళిత ద్రోహి చంద్రబాబు.. దళితుల కోసం చంద్రబాబు పెట్టిన ఒక మంచి కార్యక్రమం గురించి చెప్పగలవా..? అంటూ సవాల్ చేశారు.. ఈ నాలుగేళ్లలో 53 వేల కోట్లు దళితుల…
ఎన్టీఆర్ పేరు చెప్పుకుని మళ్లీ అధికారంలోకి రావాలని చంద్రబాబు ఆలోచన అంటూ ఫైర్ అయ్యారు మంత్రి రోజా.. ఎన్టీఆర్ జిల్లా అని చెప్పే చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు ఏం చేయలేదన్నారు.. ఒక్క జిల్లాకు లేదా మండలానికి కూడా ఎన్టీఆర్ పేరు పెట్టలేదు.. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి, పార్టీ గుర్తు, పార్టీ లాక్కున్న వ్యక్తి చంద్రబాబు.. పార్టీ డిపాజిట్లు కూడా లాక్కున్నారు అంటూ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు..
అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై విచారణ జూన్ 5కి వాయిదా.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది.. మరోవైపు ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు.. ఆయన ముందస్తు బెయిల్‌పై విచారణ సమయంలో హైకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ ఇవాళ సాధ్యం కాదని తెలిపింది తెలంగాణ హైకోర్టు.. వాదనలు…
మాదక ద్రవ్యాల నివారణపై ఫోకస్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. మాదక ద్రవ్యాల నివారణపై పోలీసు అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.. ప్రతి కాలేజీలో ఎస్ఈబీ టోల్‌ఫ్రీ నంబర్‌ను డిస్ప్లే చేయాలని సూచించిన ఆయన.. వీటికి సంబంధించి పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టాలన్నారు..
విద్యార్థులకు మరో శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇప్పటికే వేసవి సెలవులు ప్రారంభం కాగా.. స్కూళ్లు జూన్ 12న తిరిగి తెరుస్తారు.. అయితే, అదే రోజు వారికి విద్యాకానుక అందించాలని ఆదేశాలు జారీ చేశారు..
CM YS Jagan: సీఆర్డీఏ పరిధిలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు సిద్ధం అవుతోంది ప్రభుత్వం.. దీనిపై తగిన ఏర్పాట్లు చేయాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఈ రోజు సమీక్ష నిర్వహించిన సీఎం.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదలందరికీ ఇళ్ల కార్యక్రమానికి సంబంధించి నిధులకు ఎలాంటి లోటు లేదని స్పష్టం చేశారు.. 2022-23 సంవత్సరంలో 10,200 కోట్ల రూపాయలు…
Off The Record: ప్రధాని మోడీ విధానాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు సరైనవేనని ఇటీవల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన కామెంట్స్‌పై ఇప్పుడు పార్టీలో పెద్ద ఎత్తున చర్చ మొదలైందట. అభివృద్ధి, టెక్నాలజీ లాంటి అంశాల్లో మోడీతో కలిసి పని చేసేందుకు అభ్యంతరం లేదని చెప్పినా.. ఎన్డీఏకు మద్దతు ఇచ్చే విషయంలో సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామన్న బాబు కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయట. అంటే.. బీజేపీతో టీడీపీ పొత్తు ఖాయమైపోయిందా..? అనే రీతిలో…
NTR’s 100th Birth Anniversary Celebrations: వెండితెర ఆరాధ్యుడు ఎన్టీఆర్ శత జయంతి వేడుకల అంకురార్పణ విజయవాడ వేదికగా ఘనంగా ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలు, ప్రజల్ని చైతన్య పరుస్తూ వివిధ వేదికల మీద చేసిన ప్రసంగాలతో కూడిన రెండు పుస్తకాలను విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు తెలియచేసే లక్ష్యంతో టీడీపీ సీనియర్ నేత టీడీ జనార్థన్ నేతృత్వంతో సావనీర్ కమిటీ ఏర్పాటయింది. 8 నెలల నుంచి ఈ కమిటీ సావనీరు…