Anakapalle Crime: చార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడుతోన్న సమయంలో.. తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. చార్జింగ్ పెట్టిన ఫోన్ పేలి కొన్ని ప్రమాదాలు జరిగితే.. మరికొన్ని మాత్రం నిర్లక్ష్యంగా.. చార్జింగ్ పెట్టి ఉండగానే ఫోన్ మాట్లాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి.. తాజాగా, అనకాపల్లి నర్సీపట్నంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.. నర్సీపట్నం మున్సిపాలిటీ కోమటి వీధిలో రాత్రి 7:30 గంటల సమయంలో క్యాటరింగ్ బాయ్ గా పని చేస్తున్న కోమాకుల లక్ష్మణ్ అనే 25 ఏళ్ల యువకుడు తన మొబైల్‌కు చార్జింగ్ పెట్టాడు.
అయితే, ఆ సమయంలో తనకు ఫోన్ రాగా పవర్ ఆఫ్ చేయకుండా చార్జింగ్ లో ఉన్న మొబైల్ లిఫ్ట్ చేసి మాట్లాడాడు.. ఇదే సమయంలో చార్జర్ షార్ట్ సర్క్యూట్ కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినా ప్రాణాలు దక్కలేదు.. ఆస్పత్రికి వెళ్లే మార్గం మధ్యలోనే మృతి చెందాడు.. ఇక, ఈ ఘటనపై మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్ స్టేషన్లో (సెక్షన్ 174) అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు పోలీసులు..
Read ALso: Karnataka Assembly Election: రేపే ఫలితాలు.. కర్ణాటకలో గెలుపెవరిది..?