Ambati Rambabu: వైసీపీలో కొందరు సకల కళా కోవిదులున్నారు.. చిట్టి చిట్టి అడుగులేసుకుంటూ.. క్యూట్ క్యూట్ గా నన్ను విమర్శించేందుకు కొందరు నేతలు వస్తారు కదా..? వాళ్లని సీఎం అభ్యర్థులుగా ప్రకటించండి అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించిన విషయం విదితమే.. ఇక, మేం చేయలేమని వైసీపీ భావిస్తే.. మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటారు..? టీడీపీనైనా పట్టించుకోవడం లేదు కానీ.. మమ్మల్ని మాత్రం వదలడం లేదన్న ఆయన.. వైసీపీకి మేమంటే భయం అందుకే మమ్మల్ని విమర్శిస్తున్నారని కామెంట్ చేసిన విషయం విదితమే.. అయితే, జనసేనాని కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు మంత్రి అంబటి రాంబాబు.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు ఉండవు అనే నానుడికి తాజా ఉదాహరణ పవనే అన్నారు.. రాజకీయాలు చేయటం కోసం పవన్ రాజకీయ పార్టీ పెట్టలేదు.. చంద్రబాబును గెలిపించటం కోసమో పార్టీ పెట్టారని ఎద్దేవా చేశారు.. 2014లో ఒక్క సీటు కూడా తీసుకోకుండా చంద్రబాబు కోసం పని చేశాడు.. చంద్రబాబుకు అధికారం ఇవ్వటం ప్రజలకు అధికారం ఇవ్వటమా? అని నిలదీశారు.
జన సైనికులు, కాపు సోదరులు బట్టలు చించుకుని పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు అని అరుస్తా ఉన్నారు.. పవన్ నాకు సీఎం వద్దు.. మాట్లాడవద్దు అన్నాడు.. క్యాష్ తీసుకుని షూటింగ్ లు చేసుకుంటే మద్దతు పెరుగుతుందా? అని ప్రశ్నించారు అంబటి రాంబాబు.. సింగిల్ గా వెళ్తే చిత్తుచిత్తుగా ఓడిపోతాను అన్న తర్వాత వీర మహిళలు ఎందుకు? కాపు సోదరులు ఎందుకు? ఆలోచించండి అని సూచించారు. ప్యాకేజీ అడిగే చంద్రబాబు వేసే ముష్టి ఎత్తుకోవటానికి జాతి మొత్తాన్ని తాకట్టు పెట్టే దుస్థితి వచ్చిందన్నారు.. స్థానికంను అంతర్జాతీయ స్థాయి వరకు వెళ్ళి పెళ్ళి చేసుకున్న పవన్ కళ్యాణ్ కంటే సకల కళాకారులు ఎవరైనా ఉంటారా? అంటూ కౌంటర్ ఎటాక్‌కు దిగారు మంత్రి..
కొన్ని ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి.. చంద్రబాబుతో ఏం డీల్ కుదిరిందో పవన్ చెప్పాలి అని డిమాండ్ చేశారు అంబటి రాంబాబు.. పవన్ కళ్యాణ్.. చంద్రబాబుకు అమ్ముడు పోయారని ఆరోపించిన ఆయన.. ప్యాకేజీ స్టార్ అని కాకపోతే ఇంకా ఏమని పిలవాలి? అని ప్రశ్నించారు.. మీ అన్న చిరంజీవికి జనసేన కంటే ఎక్కువ ఓట్లు, సీట్లు వచ్చాయి.. చిరంజీవి ఎవరికి తన పార్టీని తాకట్టు పెట్టలేదన్నారు.. ఇక, చంద్రబాబు కాపుల మీద పెట్టిన అక్రమ కేసులను మా ప్రభుత్వం తీసేసిందన్న ఆయన.. టీడీపీ కాపు వ్యతిరేక పార్టీ అన్నారు.. వంగవీటి మోహన రంగా జీవితంలో ఎప్పుడూ కాఫీ, టీలు తాగలేదు.. అటువంటి వ్యక్తికి తాను స్వయంగా టీ ఇచ్చినట్లు పవన్ అబద్ధాలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. కాపులే ఇప్పుడు తేల్చుకోవాలి.. చంద్రబాబుకు తాకట్టు పెడుతున్న పవన్‌కు మద్దతు ఇస్తారో లేక.. కాపులను కాపాడుతున్న జగన్ కు మద్దతు ఇస్తారో తేల్చుకోవాలన్నారు..
పవన్ లాంటి అసమర్ధుడు దేశంలోనే ఉండరన్నారు అంబటి రాంబాబు.. పవన్ కళ్యాణ్ కోసం గొంతు చించుకునే వాళ్ళు ఇప్పటికైనా తెలుసుకోండి.. ఇప్పుడు మీరంతా సీఎం చంద్రబాబు అని అరవాల్సిందేనన్న ఆయన.. ఇంత దౌర్భాగ్యమైన రాజకీయాలను జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు.. వారాహిని చంద్రబాబుకు అమ్ముకుని షూటింగ్ చేసుకో.. అని సలహా ఇచ్చారు.. నిజమైన జన సైనికులు, కాపు నాయకులు కూడా ప్యాకేజీ స్టార్ అనే పరిస్థితి వచ్చింది.. ఎన్ని సీట్లో, ఎన్ని కోట్లో డిసైడ్ అయిపోయింది.. నాదెండ్ల పర్సెంటేజ్ కూడా ఫిక్స్ అయిపోయింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి అంబటి రాంబాబు..
ఇక, పవన్ కళ్యాణ్ కి ప్యాకేజీ మత్తులో ఏం మాట్లాడుతున్నారో తెలియటం లేదన్న అంబటి.. పార్టీ కార్యాలయం స్థలం లింగమనేని ఇచ్చిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.. చంద్రబాబు పెట్రోల్ పోస్తేనే వారాహి కదులుతుందని ఎద్దేవా చేశారు.. చంద్రబాబు చెబితేనే వారాహి బయటకు వస్తుంది.. లోకేష్ పాదయాత్ర ఆగిన తర్వాతే చంద్రబాబు వారాహికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడని తెలిపారు.. పోలవరాన్ని ఏటీఎంగా వాడుకోవాలనే దుర్బుద్ధి మా ప్రభుత్వానికి లేదన్న ఆయన.. పోలవరం వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్టు.. అటువంటి ప్రాజెక్టును పూర్తి చేయాలనే చిత్తశుద్ది ఉండే ఏకైక పార్టీ వైసీపీయే అన్నారు.. కేంద్రం కట్టాల్సిన పోలవరాన్ని చంద్రబాబు ఎందుకు తానే కడతాను అని అడిగాడు? అని నిలదీశారు మంత్రి అంబటి రాంబాబు.