పార్టీ లైన్ దాటొద్దు.. వివాదాస్పదంగా ప్రవర్తించి.. పార్టీకి ఇబ్బంది కలిగించొద్దు.. ప్రజల్లోకి రాంగ్ మెసేజ్ వెళ్తాయంటూ చంద్రబాబు పదేపదే క్లాస్ పీకుతున్నా.. కొందరు ఎమ్మెల్యేల తీరు మారడం లేదు. లేటెస్టుగా ఎమ్మెల్యేలు కూన రవి,దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, నజీర్ ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గురి వ్యవహారశైలిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో పుట్టిన అల్పపీడనం వాయుగుండంగా రూపాంతరం చెందుతోంది. బలమైన రుతుపవన గాలులు తోడవడంతో మరికొద్ది గంటల్లోనే బలపడి తీవ్ర ప్రభావం చూపించనుంది. ఈనెల 19న తీరం దాటుతుందని అంచనా వేస్తుండగా.. ఉత్తరాంధ్ర జిల్లాలలో ఉదయం నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, అనకాపల్లి,కోనసీమ, కాకినాడ, వెస్ట్ గోదావరి జిల్లాలకు రెడ్ అలెర్ట్ హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది.. ఏసీఏ అధ్యక్షుడిగా కేశినేని శివనాథ్ (కేశినేని చిన్ని), కార్యదర్శిగా సానా సతీష్తో సహా 34 మందితో నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా.. మూడేళ్ల కాలపరిమితితో ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ అభివృద్ధికి కృషి చేయనుంది నూతన కమిటీ..