యూరియా కొరతపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆగస్టులో లక్షా 65 వేల టన్నులు రావాల్సి ఉండగా, ఇప్పటి వరకు 65 వేల టన్నుల యూరియా రాష్ట్రానికి వచ్చింది. ఇంకా లక్ష టన్నుల యూరియా రావాల్సి ఉంది. అయితే, జూలైలోనూ 50 వేల టన్నులు తక్కువ వచ్చింది. దీంతో రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడింది. గత నెల, ఈ నెల వర్షాలు విస్తారంగా కురవడంతో పంటల సాగు ఎక్కువగా జరిగింది.
ఇవాళ్టి నుంచి స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ చేయనున్నారు.. ఉదయం 10:30కు వరలక్ష్మీనగర్, విజయవాడ ఈస్ట్, ఎన్టీఆర్ జిల్లా.. మధ్యాహ్నం 12:00 గంటలకు కంకిపాడు, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణా జిల్లాలో.. ఇంటింటికి స్మార్ట్ రైస్ కార్డుల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.
ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు తీపికబురును అందించింది. వైద్యారోగ్య శాఖలో ఉద్యోగులకు ప్రమోషన్స్ కల్పించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైద్యులు, అధికారులు కలిపి మొత్తం 223 మందికి ప్రమోషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఆయుష్ విభాగంలో అదనపు సంచాలకుల పోస్టుకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ప్రజారోగ్య విభాగంలో డిప్యూటీ డైరెక్టర్లకు జాయింట్ డైరెక్టర్లుగా పదోన్నతులు కల్పించాలని నిర్ణయించింది. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ అందించింది. రేపటి నుంచి ఇంటింటికీ ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. నాలుగు విడతల్లో స్మార్ట్ కార్డుల పంపిణీ చేయనున్నారు. ఆయా రేషన్ షాపుల వద్ద లబ్ధిదారులకు అందజేయనున్నారు. మొదటి విడత లో రేపటి నుంచి 9 జిల్లాల్లో కార్డుల పంపిణీ చేపట్టనున్నారు. విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్, తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాల్లో రేషన్ కార్డుల జారీ చేయనున్నారు. రెండో…
ఏపీలోయూరియా లభ్యత, సరఫరాపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్, డీజీపీ, వ్యవసాయశాఖ, విజిలెన్స్ అధికారులు తో కీలక సమీక్ష చేశారు. జిల్లాల వారీగా ఎరువుల లభ్యత, సరఫరా వివరాలపై సీఎం ఆర తీశారు..విజిలెన్స్ తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు సీఎం చంద్రబాబు.. యూరియా ఎరువుల నిల్వలు తనిఖీ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఏపీ సీఎస్, డీజీపీ, వ్యవసాయ శాఖ, విజిలెన్స్ అధికారులకు సమీక్ష సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు. విజిలెన్స్ తనిఖీలు ముమ్మరంగా చేపట్టాలని…
మంజుమ్మల్ బాయ్స్ మూవీ సీన్ రిపీట్ అయ్యింది. ఈ సినిమాలో ఫ్రెండ్స్ అంతా కలిసి కొడైకెనాల్ ట్రిప్ కు వెళ్తారు. అక్కడ అందమైన ప్రదేశాలను చూసి చివరకు గుణ కేవ్స్ ను చూసేందుకు వెళ్తారు. ఈ క్రమంలో సుభాష్ అనే వ్యక్తి 150 అడుగుల లోతైన లోయలో పడిపోతాడు. తమ స్నేహితుడిని రక్షించుకునేందుకు మిగిలిన స్నేహితులు చేసే ప్రయత్నం స్నేహానికి ఉన్న విలువను చాటి చెప్పింది. ఇప్పుడు ఇదే తరహాలో ఓ పర్యాటకుడు పెనుకొండ కొండమీదికి వెళ్లి…
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. అంబటి మాట్లాడుతూ.. 2019లో 23 సీట్లు ఓటు షేర్ కంటే 2024లో. 2.5 శాతం జగన్ కు అత్యధికంగా ఓట్లు వచ్చినట్లు తెలిపారు. ఈసారి ఎన్నికలు జరిగితే కూటమి ఓడిపోతుందని చంద్రబాబుకు అర్థం అయిపోయింది.. సింగపూర్ లో ఇన్వెస్టర్లకు అర్థమైంది.. చంద్రబాబు భయంతో ఆరోపణలు చేస్తున్నారు.. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే.. పోలవరం ప్రాజెక్టు ఈ దుస్థితికి పడిపోయిందంటే కారణం చంద్రబాబే..…
Minister Ramprasad Reddy: ఎన్టీవీతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మంత్రి రాసలీలల ఆరోపణలు చేస్తూ వైసీపీ రాద్ధాంతం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.