త్వరలో ఏపీలో మంత్రి, పాలకొల్లు శాసన సభ్యుడు నిమ్మల రామనాయడు కుమార్తె వివాహం జరగనుంది. ఈ క్రమంలో ఆయన నందమూరి బాలకృష్ణను వివాహానికి ఆహ్యానించారు. దీంతో ఆయన ఆసక్తికరంగా స్పందించారు. వస్తానని ఎలా వస్తానో చెప్పనని తెలిపారు. ఈ విషయాన్ని రామానాయుడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
Also Read:Kalvakuntla Kavitha: ‘నాన్నా’ జాగ్రత్త.. మీ వెనక భారీ కుట్ర జరుగుతోంది!
ఈ మేరకు బాలకృష్ణను ఆహ్వానిస్తున్న వీడియో సైతం షేర్ చేశారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణ గారు ను కలిసి పాలకొల్లులో ఈనెల 24వ తేదీన జరగబోయే నా కుమార్తె శ్రీజ వివాహ శుభలేఖ అందజేసి రమ్మని ఆహ్వానించగా వస్తానని ఎలా వస్తానో చెప్పనని తెలిపారు. మరియు ప్రముఖ చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను గారు ను కూడా రమ్మని ఆహ్వానించడం జరిగింది అని రామానాయుడు పేర్కొన్నారు.