నువ్వెంత నీ బ్రతుకెంత జగన్ అంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటి నుంచీ మీడియాలో ఏం వాక్కుంటారో వాక్కోండి.. మేం ఏమీ మర్చిపోలేదు.. ఇదే పోలీసు స్టేషన్ లో పంచాయితీ పెడతాం మీకు.. ఏ పోలీసులను మీరు ఇబ్బంది పెట్టారో అదే పోలీసులతో మీ మక్కెలు విరగ్గొట్టిస్తాం.. కొల్లేరు ప్రజలకు జనసేన, టీడీపీ వచ్చి బలమైన న్యాయం చేస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు.
విశాఖ ఉక్కు అప్పులను నష్టాలుగా చూపించి కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం అన్యాయం అంటూ సీతారాం ఏచూరి మండిపడ్డారు. వ్యవస్థను మొత్తం పెట్టుబడిదారుల చేతుల్లోకి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెడుతోంది అని ఆయన విమర్శలు గుప్పించారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన పాపాలు రాయలసీమకి శాపాలుగా మారుతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. జగన్ చేసిన నేరాలు, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకి ఉరివేస్తున్నాయి.. అక్రమాస్తుల కేసుల మాఫీ కోసం ప్రత్యేక హోదా వదులుకున్నాడు అని ఆయన విమర్శించారు.