ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. రెండు రోజులపాటు దేశ రాజధానిలో సీఎం పర్యటించనున్నారు. కాగా, ఇవాళ సాయంత్రం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో చర్చించారు. పోలవరం నిధులను త్వరగా విడుదల చేయాలని ఆయన వినతి చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు జైలు నుంచీ బయటకు వస్తారని ఆశిస్తున్నాను అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. జగన్ ఒక లాల్ బహాదూర్ శాస్త్రి, వాజ్ పేయి అయితే నేను ఇలా మాట్లాడను.. వచ్చే దశాబ్ద కాలం మనం కలిసి పనిచేయాలి అని టీడీపీకి చెపుతా.. 2009లో కోల్పోయిన నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను అని ఆయన పేర్కొన్నారు.