మంత్రి అంబటి రాంబాబు జనసేన-టీడీపీ పార్టీల పొత్తుపై ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ చంద్రబాబు కోసమే పనిచేశారని.. ఆయన ప్యాకేజ్ స్టార్ అని మరోసారి నిరూపించుకున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. సున్నా సున్నా కలిస్తే ఫలితం సున్నా అంటూ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్, లోకేష్‌ల సమావేశంతో ఏం లాభమని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకి మనోధైర్యం ఇవ్వడానికి రాజమండ్రి వెళ్లాను అని పవన్ చెబుతున్నారు.. లోకేశ్ పల్లకి మోయడం కోసం పని చేస్తున్నారు అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
Read Also: US: H-1B వీసా ప్రక్రియలో US కొత్త ప్రతిపాదనలు ఇవే ..
ఇంతకీ.. టీడీపీ, జనసేన మీటింగ్‌లో ఏదైనా విషయం ఉందా..? బలహీన పడ్డ టీడీపీని బలోపేతం చేయడం కోసం కలిశానని పవన్ కళ్యాణ్ చెప్ప్తున్నారు.. కానీ ప్రజలు ఈ కలయికని పట్టించుకోవడం లేదని ఆయన తెలిపారు. అయితే, మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా ( ఎక్స్ ) సొంత కుమారుడు.. అద్దె కుమారుడు.. ఇద్దరూ ఉత్తర కుమారులే !.. సూటుకేసు తీసుకో..లోకేషుతో కలిసిపో!.. అనే పోస్ట్ ను పెట్టారు.
Read Also: Hyderabad: ఓ వివాహితపై ఇద్దరు మహిళల అఘాయిత్యం
అయితే, టీడీపీ కోసమే పుట్టిన పార్టీ జనసేన అని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కు సొంత ఆలోచనా లేదు.. మూడేళ్ళ కిందటే చంద్రబాబు పల్లకిని పవన్ కళ్యాణ్ మోస్తారని తాము చెప్పాం.. ఎంత మంది కలిసినా జగన్ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరని ఆయన పేర్కొన్నారు. వీరి మేనిఫెస్టో రాష్ట్రాన్ని కాపాడే విధంగా ఉంటుందో, టీడీపీని కాపాడే విధంగా ఉంటుందో చూద్దాం అని మంత్రి అన్నారు. జైల్లో ఉండే ప్రతివాడు ప్రజల గుండెల్లో ఉండరు.. బయటకు వస్తే సాక్ష్యాధారాలు బయటపడతాయనే చంద్రబాబును రిమాండ్‌లో ఉంచారు.. వ్యవస్థలను మేనేజ్ చేయటం కోసమే 17ఏ మీద చంద్రబాబు పోరాడుతున్నారు.. ఆయన లోపల ఊచలు లెక్క పెట్టుకోవటం, బయట లోకేష్ రోజులు లెక్క పెట్టుకోక తప్పదు అంటూ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు.