CM Chandrababu: కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు సీఎం చంద్రబాబు ఫోన్.. వెంటనే ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం..
- కేంద్రమంత్రి జేపీ నడ్డాకు సీఎం చంద్రబాబు ఫోన్..
- యూరియా సరఫరాపై ఫోన్ లో మాట్లాడిన సీఎం..
- కాకినాడ తీరానికి వచ్చే నౌకలో 7 వేగన్లు ఏపీకి కేటాయించాలని వినతి..
- 17,293 మెట్రిక్ టన్నుల యూరియా కాకినాడ పోర్టులో దిగుమతికి..
- జీవో జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: కేంద్రమంత్రి జేపీ నడ్డాకు ఫోన్ చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. రాష్ట్రంలో యూరియా సరఫరాపై సమీక్ష నిర్వహించిన సీఎం.. సమావేశం మధ్యలోనే జేపీ నడ్డాకు ఫోన చేశారు.. కాకినాడ తీరానికి వచ్చే నౌకలో 7 వేగన్లు.. ఏపీకి కేటాయించాలని కోరారు.. దీనిపై సానుకూలంగా స్పందించారట నడ్డా.. ఇక, దీంతో, రాష్ట్రానికి 17,293 మెట్రిక్ టన్నుల యూరియాను కాకినాడ పోర్టులో దిగుమతికి జీవో జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రంలో అత్యవసరంగా యూరియా కోసం ఎదురుచూస్తున్న జిల్లాలకు యుద్ధప్రాతిపదికన యూరియాను పంపాలని అధికారులను ఆదేశించారు మంత్రి అచ్చెన్నాయుడు.. రైతులకు ఎక్కడా యూరియా సమస్య లేకుండా చూడాలని స్పష్టం చేశారు..
Read Also: SS Rajamouli : వెబ్ సిరీస్ లో నటించిన రాజమౌళి.. ఎలా చేశాడో చూశారా..
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
ఇక, రాష్ట్రంలో ప్రస్తుతం 80,503 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వ ఉందని మంత్రి అచ్చెన్నాయుడికి తెలిపారు అధికారులు.. యూరియాను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అచ్చెన్నాయుడు.. ఎరువుల కేటాయింపు అంశంపై కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో ఫోన్‌లో సీఎం చంద్రబాబు మాట్లాడటం వలనే రాష్ట్రానికి యూరియా కేటాయింపు జరిగిందన్నారు.. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి రైతులకు ఎరువులపై భరోసా ఇవ్వాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు.. మరోవైపు, రబీ సీజన్ కు కేంద్రం 9.3 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను రాష్ట్రానికి కేటాయించిందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు మంత్రి అచ్చెన్నాయుడు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!