నేడు వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర 11వ రోజుకు చేరుకుంది. ఈ బస్సు యాత్రకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు వస్తున్నారు. జగన్ సర్కార్ చేస్తున్న అభివృద్దిని ప్రజల్లోకి వైసీపీ నాయకులు తీసుకెళ్తున్నారు. ఇక, నేడు ప్రకాశం జిల్లా కనిగిరిలో సామాజిక సాధికారిక యాత్ర కార్యక్రమం కొనసాగనుంది.
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఫైబర్ నెట్ కేసుపై రేపు ( గురువారం ) సుప్రీం కోర్టులో విచారణ జరుగనుంది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు సుప్రీం కోర్టుకు వెళ్లారు. రేపేు కోర్ట్ నెంబర్ 6లో 11 వ నెంబర్‌గా చంద్రబాబు కేసు లిస్ట్ లో ఉంది.