కృష్ణాజిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తోట్లవల్లూరు మండలంలోని పాములలంకలో విద్యుత్ షాక్ తో ఇద్దరు రైతులు మృతి చెందారు. పాములలంకకు చెందిన పాముల విజయాంభ, పాముల చిరింజీవిగా గుర్తించారు.
వైసీపీ చేపట్టిన సామాజిక సాధికారిత బస్సు యాత్రకు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ దొరుకుతుంది. నేడు 10వ రోజు బస్సుయాత్రలో భాగంగా రాయలసీమలో ఆళ్లగడ్డ, కోస్తాంధ్రాలో వినుకొండ, ఉత్తరాంధ్రాలో ఆముదాలవలసలో ఈ బస్సు యాత్ర కొనసాగబోతుంది.
దీపావళి సెలవులో కీలక మార్పు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్యాలెండర్లో గానీ, ప్రభుత్వం జారీ చేసిన పండగ సెలవుల జాబితాలో గానీ దీపావళి నవంబర్ 12వ తేదీ అని ఉంది. 12వ తేదీన ఉన్న సెలవును 13వ తేదీన సాధారణ సెలవుగా పేర్కొంటూ ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు విడుదల చేశారు.
Vijayasai Reddy: బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. సోషల్ మీడియాలో రోజుకో రచ్చ అనే తరహాలో ఈ వ్యవహారం సాగుతోంది.. మీడియాతో మాట్లాడే సందర్భంలోనూ ఈ వ్యవహారాన్ని ప్రస్తావిస్తున్నారు.. ఇక, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేసేవరకు వ్యవహారం వెళ్లినా.. ఎవరూ వెనక్కి తగ్గడం లేదు.. తాజాగా మరోసార పురంధేశ్వరిపై హాట్ కామెంట్లు చేశారు ఎంపీ సాయిరెడ్డి..…
ప్రజా సంకల్పయాత్ర అంటూ ఉక్కు సంకల్పంతో పాదయాత్ర చేసిన వైఎస్ జగన్ చరిత్ర సృష్టించాడు.. అలాంటి పాదయాత్ర ఇవాళ్టికి ఆరేళ్లు పూర్తి చేసుకుంటుంది.. ఈ రోజును రాష్ట్రవ్యాప్తంగా పండుగలా జరుపుకుంటుంది వైసీపీ.. అధికారంలోకి కూడా రావడంతో.. ఘనంగా ఈ వేడుకలు నిర్వహిస్తోంది..
విజయవాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది.. పండిట్ జవహర్లాల్ నెహ్రూ బస్టాండులో ప్లాట్‌ఫారమ్ మీదకు దూసుకెళ్లింది ఆర్టీసీ బస్సు.. ఈ ఘటనలో ఇద్దరు అక్కడి అక్కడే మృతిచెందగా.. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక బస్టాండ్‌లో ఉన్న ప్రయాణికులు భయంతో వణికిపోయారు.. ఉదయం సర్వ సాధారణంగా నెహ్రూ బస్టాండ్ రద్దీగా ఉంటుంది.. ఈ సమయంలో ప్రమాదం చోటు చేసుకోవడంతో అంతా ఆందోళనకు గురయ్యారు.