రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది.. రైతుల అప్పుల్లో కూడా మన రాష్ట్రానిదే అగ్రస్థానమే అని ఆరోపించారు టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. వ్యవసాయ రంగంపై వేల కోట్ల ఖర్చు చేశామని ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందన్నారు.
పురందరేశ్వరి ఒక జగత్ కిలాడీ.. బావ కళ్లులో ఆనందం కోసం లేఖలు రాస్తోంది.. పురంధేశ్వరి లాంటి నీతి మాలినా, జగత్ కిలాడి లాంటి కూతురు ఎవరికి పుట్టకూడదని కోరుకుంటున్నాను.. పురంధేశ్వరి లాంటి కూతురు పుట్టిందని ఎన్టీఆర్ కుమిలి కుమిలి ఎడుస్తుంటారు అంటూ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ని నారా లోకేష్ నేతృత్వంలోని టీడీపీ బృందం కలిసింది. జగన్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు చెక్ పెట్టేలా రాజ్యాంగంలోని ఆర్టికల్ 355 ప్రకారం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ కు టీడీపీ నేతలు కోరారు.
ఏపీ సౌతిండియా బీహార్ గా మారుతోంది అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. చంద్రబాబు సహా టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని వివరించాం.. ఆధారాల్లేకుండా రోజుల తరబడి జైళ్లల్లో ఉంచుతున్నారు.
విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండులో దుర్ఘటనతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ బస్సు యాక్సిడెంట్ పై నివేదిక సిద్ధమైంది. నివేదికపై అధికారులతో ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమల రావు చర్చిస్తున్నారు.
విశాఖపట్నంలో వైసీపీ సీనీయర్ నేత వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర పెందుర్తి నియోజకవర్గంలో ఈ నెల 25 తేదీన విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చిన ఏపీలో వైఎస్సార్సీపీ గెలుపును ఎవరు ఆపలేరు అని ఆయన పేర్కొన్నారు.
ర్తెతులకు ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా మోసం చేసిన సీఎం జగన్ బటన్ నొక్కడం కూడా మోసగించడమేనంటూ ఆమె మండిపడ్డారు. నా మీద చేసే విమర్శలు డ్తెవర్షన్ పాలిటిక్స్ మాత్రమే అని పురంధేశ్వరి తెలిపారు.
Kurnool: విలువ తెలిసిన వాళ్ళకి దొరకదు. దొరికిన వాళ్లకి విలువ తెలియదు అన్నట్లు.. పెళ్లికాక కొందరు బాధపడుతుంటే.. పెళ్లి చేసుకుని నమ్మి వెంట వచ్చిన భార్యను చిత్రహింసలు పెట్టి అర్ధాయుష్షుతో తనువు చాలించేలా చేస్తున్నారు మరికొందరు. కన్నవాళ్ళను వదిలి కట్టుకున్న భర్తే జీవితం అనుకుని వచ్చిన భార్యను వరకట్నం కోసం వేధిస్తున్నారు. వేధింపులు తాళలేని మహిళలు తనువు చాలిస్తున్నారు. వరకట్నం వేధింపులతో మహిళలు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు గతంలో కోకొల్లలు. అలానే చట్టం తన పని తాను…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి జిరాక్స్ రిజిస్ట్రేషన్ల విధానం అమల్లోకి రానుంది. ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నంలో ఈ విధానాన్ని స్టార్ట్ చేయగా.. నేటి నుంచి రాష్ట్రం మొత్తం అమలు చేయనున్నారు.