Adudam Andhra: ‘ఆడుదాం ఆంధ్రా’ రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురూ.. ప్రైజ్ మనీ వివరాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adudam Andhra: ఆంధ్రప్రదేశ్ మెగా క్రీడా టోర్నీకి సిద్ధమవుతోంది.. ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా క్రీడా సంబరాల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఏర్పాట్లలో మునిగిపోయింది.. అందులో భాగంగా ఆడుదాం ఆంధ్రా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించింది.. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖో ఖో, బ్యాడ్మింటన్ క్రీడా పోటీలు నిర్వహించబోతున్నారు.. గ్రామ , వార్డు సచివాలయ, మండల , నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు నిర్వహించనున్నారు.. 15 ఏళ్ల వయసు పైబడిన అందరూ రిజిస్ట్రేషన్ కు అర్హులే.. మొత్తం ఐదు దశల్లో 2.99 లక్షల మ్యాచ్‌లు/ఈవెంట్లు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు..
ఇక, 15 ఏళ్లు పైబడిన బాలబాలికలకు క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖోతో పాటు 3కే మారథాన్, యోగా, టెన్నికాయిట్ వంటి పోటీలను నిర్వహించేలా ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం.. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో సాంప్రదాయ క్రీడల్లోనూ పోటీలను పెట్టనున్నారు.. ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలకు సుమారు మూడు నెలల సమయం ఉండటంతో గ్రామ/వార్డు సచివాలయ స్థాయిలో క్రీడాకారులను గుర్తించి.. వారు మంచి తర్ఫీదు పొందేలా శాప్ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ఆయా సచివాలయాల పరిధిలో బాలబాలికలకు విడివిడిగా స్పోర్ట్స్ కిట్లను అందించనుంది. బ్యాడ్మింటన్ రాకెట్లు, రింగ్‌లు, క్రికెట్ కిట్, వాలీబాల్‌లు సమకూర్చనుంది. 26 జిల్లాల వారీగా ఎన్ని కిట్లు అవసరమో.. వాటి జాబితాను సిద్ధం చేస్తోంది.
Also Read
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో నిర్వహిస్తోన్న మొట్టమొదటి రాష్ట్రవ్యాప్త క్రీడా కార్యక్రమం ఇది.. క్రీడాల ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం, ప్రతిభావంతులైన క్రీడాకారులని కనుగొని వారిని పెద్ద వేదికకు పరిచయం చేయడం.. క్రీడా నైపుణ్యాన్ని ప్రోత్సహించడం.. ఈ ఈవెంట్స్ యొక్క నినాదం.. విజేతలకు ప్రైజ్‌మనీ కింది రూ.12 కోట్లు మరియు మరెన్నో ఉత్తేజకరమైన బహుమతులు అందించనున్నారు..
క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖో ఖో పోటీలకు నియోజకవర్గ స్థాయిలో తొలి స్థానంలో నిలిస్తే రూ.35 వేలు, జిల్లాస్థాయిలో ప్రైజ్ మనీ రూ.60 వేలు, రాష్ట్రస్థాయి ప్రైజహమనీ రూ.5 లక్షలుగా ఉంది.. అదే రెండో ప్రైజ్ విషయానికి వస్తే నియోజకవర్గస్థాయిలో రూ.15 వేలు, జిల్లాస్థాయిలో రూ.30వేలు, రాష్ట్రస్థతాయిలో రూ.3 లక్షలుగా నిర్ణయించారు.. ఇక, మూడో ప్రైజ్‌గా నియోజకవర్గ స్థాయిలో రూ.5వేలు, జిల్లాస్థాయిలో రూ.10వేలు, రాష్ట్రస్థాయిలో రూ.2 లక్షలుగా నిర్ణయించారు.
ఇక, బ్యాండ్మింటన్ డబుల్స్ విభాగంలో మొదటి బహుమతి ప్రైజ్ మనీ విషయానికి వస్తే నియోజకవర్గ స్థాయిలో రూ.20వేలు, జిల్లాస్థాయిలో రూ.35 వేలు, రాష్ట్రస్థాయిలో రూ.2 లక్షలుగా నిర్ణయించారు. రెండో ప్రైజ్‌గా నియోజకవర్గస్థాయిలో రూ.10వేలు, జిల్లాస్థాయిలో రూ.20 వేలు, రాష్ట్రస్థాయిలో రూ.లక్షగా.. మూడో ప్రైజ్ కింద నియోజకవర్గ స్థాయిలో రూ. 5వేలు, జిల్లాస్థాయిలో రూ.10వేలు, రాష్ట్రస్థాయిలో రూ.50వేలుగా నిర్ణయించారు. నమోదు చేసుకోవడానికి 15 ఏళ్లు పైబడిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పుషులు, మహిళలు అర్హులు .. ఇప్పుడే నమోదు చేసుకోవడానికి 1092కి కాల్ చేయడం ద్వారా లేదా మీ సమీపంలోని ఉన్న సచివాలయాన్ని సంప్రదించవచ్చు.. ఇక, డిసెంబర్ 15వ తేదీ నుంచి 2024 ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఈ టోర్నమెంట్లను నిర్వహించనున్నారు.

తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!