MP Magunta Srinivasulu Reddy: తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఒంగోలు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి.. తాను గత 40 ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్నాను.. ఈ నాలుగేళ్లలో పడ్డ ఇబ్బందులు ఎప్పుడూ పడలేదని తాను వ్యాఖ్యానించినట్లు ప్రచారం చేస్తున్నారని డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీకి వెళ్లాలని అనుచరుల నుంచి వత్తిడి వస్తున్నట్లు తనపై ఆసత్య ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై సోషల్ మీడియాలో ఇటువంటి ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు లేఖ ద్వారా కోరారు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి.
Read Also: Amrit Bharat Express Ticket Price: ‘అమృత్ భారత్’ ఛార్జీలు ఎక్కువే.. కనీస టికెట్ ధర 35!
కాగా, ఏపీలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్నాయి.. 2024 ఎన్నికలను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.. ఇదే సమయంలో.. పలువురు నేతలు ఇతర పార్టీల్లో చేరుతున్నారు.. ఇంకా కొందరు పార్టీ వీడుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు.. ఒంగోలు ఎంపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాగుంట శ్రీనివాసులురెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.. గుర్తుతెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో ఈ ప్రచారాన్ని విస్తృతంగా చేస్తున్నారు. దీంతో. మాగుంట వైపు కొందరు అనుమానంగా చూస్తున్నారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న ఎంపీ.. తనపై జరుగుతోన్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు. ఆ ప్రచారాలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.