Cricket Match Dispute: క్రికెట్ మ్యాచ్‌లో గొడవ.. 15 ఏళ్ల ఆటగాడిని చంపేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cricket Match Dispute: ఢిల్లీలో ఆటస్థలం రణరంగంగా మారింది. క్రికెట్ ఆడుతున్న సమయంలో తలెత్తిన చిన్నపాటి వివాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తిలక్ నగర్ జిల్లాలోని వుడ్‌ల్యాండ్ పార్క్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. అసలేం జరిగిందంటే.. ఫిబ్రవరి 23, రాత్రి 7:22 గంటల సమయంలో తిలక్ నగర్‌లోని వుడ్‌ల్యాండ్ పార్క్‌లో కొందరు బాలురు క్రికెట్ ఆడుతున్నారు. ఈ క్రమంలో 12 ఏళ్ల బాలుడికి, 15 ఏళ్ల మరో బాలుడికి మధ్య మాటా మాటా పెరిగి గొడవ మొదలైంది. తొలుత సాధారణ వాగ్వాదంగా ప్రారంభమైన ఈ వివాదం.. చివరికి ప్రాణాంతక దాడిగా మారింది.
అయితే, తొలి గొడవ తర్వాత, 12 ఏళ్ల బాలుడు ఇంటికి వెళ్లి తన బంధువులైన మరో ఇద్దరు మైనర్లకు (17, 13 ఏళ్లు) జరిగిన విషయం చెప్పాడు. ఆగ్రహంతో ముగ్గురూ కలిసి 15 ఏళ్ల బాలుడి కోసం పార్క్ ప్రాంతంలో వెతికారు. బాధితుడు కనిపించగానే ముగ్గురు కలిసి అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దాడి సమయంలో బాధితుడి మెడ, తలపై తీవ్రమైన గాయాలయ్యాయి. దెబ్బల ధాటికి అతను అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు. వెంటనే స్పందించిన స్థానికులు మరియు కుటుంబ సభ్యులు అతన్ని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే బాలుడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై తిలక్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితులైన ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు.
Also Read
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
ఇక, జువెనైల్ జస్టిస్ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు పోలీసులు.. మరణానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుసుకోవడానికి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపారు. అయితే, మృతుడు ఒక టీ వ్యాపారి కుమారుడు. నలుగురు సోదరులలో మూడవవాడైన ఈ బాలుడు ఇలా అకాల మరణం చెందడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?