MP Gorantla Madhav: ఆంధ్రప్రదేశ్‌లో సీట్ల మార్పులు – చేర్పుల వ్యవహారం చర్చగా మారింది.. దీంతో, వచ్చే ఎన్నికల్లో సీటు ఎవరికి వస్తుంది..? లేదా ఉన్న స్థానం మారిపోతుందా? అనే టెన్షన్ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది.. ఈ నేపథ్యంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. వైసీపీ అధిష్టానం చేపట్టిన సీట్ల మార్పులు – చేర్పులపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. నాకు టిక్కెట్ వస్తోందో? రాదో? తెలియదు అన్నారు. అయితే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చిన వారి గెలుపు కోసం పనిచేస్తాను అని ప్రకటించారు. ఇక, అధిష్టానం నుంచి నాకు ఎలాంటి పిలుపు అందలేదన్న ఆయన.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కురబ (కురుమ) సామాజిక వర్గం బలంగా ఉందని గుర్తుచేశారు.
Read Also: Ranbir Kapoor : రణబీర్ కపూర్‌పై మండిపడుతున్న హిందువులు.. పోలీసు కేసు నమోదు..
నేను ముఖ్యమంత్ర వైఎస్ జగన్మోహన్‌రెడ్డి (జగనన్న) సైనుకుడి.. ఆయన మాటే శిరోధార్యం అని స్పష్టం చేశారు ఎంపీ గోరంట్ల మాధవ్.. పనితీరు, సర్వేలు, కుల, మతాల ప్రాతిపదికన అభ్యర్థి ఎంపిక జరుగుతోందన్నారు. అయితే, తనను జగన్ అన్న ఎక్కడికి వెళ్లాలంటే అక్కడికి వెళ్తానని తెలిపారు. అన్ని కులాలకు, మతాలకు చట్ట సభల్లో ప్రాతినిధ్యం ఉండాలనేది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్ర వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ధ్యేయమని వెల్లడించారు హిందూపురం లోక్‌సభ సభ్యులు గోరంట్ల మాధవ్. కాగా, ఎన్నికల ముందు ఏపీలో కీలక మార్పులు చేస్తోంది వైసీపీ.. పలు స్థానాల అభ్యర్థులను తొలగించేందుకు సిద్ధమైంది.. కొందరు మంత్రులకు కూడా స్థాన చలనం తప్పడంలేదు.. మరోవైపు.. ఈ సారి తమకు సీటు రావడం కష్టమని భావించిన మరికొందరు నేతలు.. పక్కపార్టీల వైపు చూస్తున్న విషయం విదితమే.