Atchannaidu: సీఎస్ జవహర్ రెడ్డికి ఏపీ టీడీపీ చీఫ్ లేఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. లిక్కర్ అమ్మకాల వివరాలను ఆన్ లైన్ లో నుంచి తప్పించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లేఖలో అచ్చెన్నాయుడు రాసిన వివరాలు.. లిక్కర్ అమ్మకాలు, ఆదాయాలకు సంబంధించిన డేటాను వైసీపీ ప్రభుత్వం వెబ్ సైట్ నుంచి తొలగించింది అని విమర్శలు గుప్పించారు. లిక్కర్ ఆదాయం ఎక్కడికి వెళుతోందో మీకు తెలుసే ఉంటుంది.. దేశ వ్యాప్తంగా పారదర్శకత కోసం డిజిటల్ ట్రాన్సాక్షన్ వైపు మళ్లుతుంటే ఏపీలో మాత్రం క్యాష్ ట్రాన్సాక్షన్‌లో మాత్రమే అమ్మకాలు చేస్తోంది అని అచ్చెన్నాయుడు ఆరోపణలు చేశారు.
Read Also: Bhuma Akhila Priya: ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, పోలీసులపై మాజీ మంత్రి అఖిల ప్రియ ఫైర్
Also Read
వైసీపీ నేతలు వారి రాజకీయ లబ్ది కోసం అధికారులు తప్పులు చేసేలా ఒత్తిడి చేస్తున్నారు అంటూ ఆంధ్ర ప్రదేశ్ తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాజకీయ నాయకుల ఒత్తడిలకు తలొగ్గి అధికారులు తప్పులు చేస్తే ఇబ్బందులు పడుతారు.. మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్న సందర్భంలో ఎన్నికల సంఘం కంటపడకుండా ఉండేందుకు వైసీపీ ప్రభుత్వం లిక్కర్ డేటాను రహస్యంగా ఉంచుతోంది అని ఆయన విమర్శలు గుప్పించారు. కోర్టు స్క్రూటినీ నుంచి తప్పించుకునేందుకు.. లిక్కర్ డేటానే తారుమారు చేసేందుకు లిక్కర్ డేటాను వెబ్ సైట్ నుంచి తొలగించారు.. వైసీపీ నాయకుల ఒత్తిడికి తలొగ్గకుండా అధికారులు చట్టం ప్రకారం పని చేసేలా చూడండి.. లిక్కర్ అమ్మకాల, ఆదాయాలకు సంబంధించిన డేటా వెబ్ సైట్ ను పునరుద్దరించాలి అని అచ్చెన్నాయుడు కోరారు.
తాజావార్తలు
-
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
-
Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
-
SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
-
Tirupati Crane Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
-
Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!